పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

ణముచేత ముల్లోకముల నేలజాలి యున్నావు." ఇట్లు పలికి యన్నిటిబంధములు నవలీలగా గొఱికివైచి వానిని సాదరముగా బూజించి హిరణ్యకుడు కపోతరాజుతో మరలనిట్లనెను.

"మిత్రమా! చిత్రగ్రీవా! వలలో దగులుకొంటి నని విచారింపకుము. ఆమిషము నాకాశమున యోజనము దూరము నుండియైన జూడగలపక్షి యాపత్కాలము ప్రాప్తమై నప్పుడు తనసమీపమున బన్న బడిన వలను సైతము జూడజాలదు. కాలము ప్రాప్తించినపుడు సూర్యచంద్రులకు రాహుకేతుగ్రహపీడయు గజసర్పములకు బంధనమును, బుద్ధిమంతులకు దారిద్ర్యమును గలుగుచుండుట జూచినచో విధి బలవత్తర మని తేలును గదా! కావున గాలమతిక్రమింపరానిది" అని యూరడించి, యాలింగన మొనరించి, సపరివారముగా నాతిథ్యమొసగి హిరణ్యకుడు చిత్రగ్రీవుని బంపెను. ఆ కపోతరా జానందమున యథేచ్ఛముగా వెడలెను. హిరణ్యకుడు తనకలుగు జొచ్చెను.

కాబట్టి పెక్కుమంది సన్మిత్రులను సంపాదింపవలయును. ఒక్క మూషికమువలన బావురముల కెంతమేలు చేకూఱెనో చూడుడు!

లఘుపతనక మనెడి వాయసము హిరణ్యకుని చెలిమి గోరుట

వెంటనంటిపోయి పావురములు సంగతి యంతయు జూచి లఘుపతనక మనెడి బూరుగుచెట్టుమీది వాయసము