ఈ పుట ఆమోదించబడ్డది

అతని కార్యము లెట్లుండినవి? అతని వాజ్మాధుర్య మెట్లుండెడిది? అన్యుల మనసులను వశపఱచుకొనుటలో నత డెంత యనుభవశాలి? భోగముల నొకమూలకు ద్రోసి యీ యోగసిద్ధికై పాటుపడుము. రాజ్యాంగవిషయమైన గొడవ యెప్పుడు నిట్లే యుండును, సుప్రసిద్ధుడైన నీతండ్రి చేసిన దానికంటె నెక్కువ చేయుటకు బ్రయత్నింపుము. నీకు నే నింతకంటె నేమి వ్రాయగలను?


_______