నెట్లు ఉపయోగించవలెనో మనసులో నుంచుకొనవలెను. మనకు మనుష్యబల మెల్లప్పుడు మిక్కిలి యవసరము. కనుక వారిలోపముల నెప్పుడు క్షమించవలెను. న్యాయమునకు బద్ధులము గావలెను. న్యాయము నుపే---చిన యెడల మనము నాశనము నొందుదుము. వివేకమును ధర్మము-- దాటవద్దు. న్యాయము లేకుండ యే సత్కార్యమును గాదు. తన ధర్మము నెడల ప్రాలుమాలినవాడు భాగ్యవంతుడు గానేరడు. మంచిసమయమున ధైర్యము విడనాడుట వినాశ హేతువు కష్టపరంపరచేత విసుగు చెందవద్దు. ఉత్సాహము గోలుపోవద్దు. కార్యభంగ మయినప్పు డుత్సాహముతో బున:ప్రయత్నము జేసిన నీకు గొఱత యుండదు. నీ ప్రభుత్వపువ-- జాగ్రత్తగ బన్ని గొప్ప రాజనీతిధురంధురులకు గూడ నాశ్చర్యము గల్గునట్లు మెలగుము. కాఠిన్యము ప్రభుత్వము యొక్క ముఖ్యకీలకము. కాఠిన్యము కొంచెము తగ్గినపక్షమున బ్రభుత్వ మంతయు క్షణములో శిధిల మగును. యుద్ధభూమిని రాజు శత్రువుల కెట్టయెదుట నెప్పుడు నిలువగూడదు. అట్లు నిలుచుట రాజనీతికి విరుద్ధము. వందలకొలది మనుష్యులకు రాజు వేషములు వేసి వారే రాజు లని భ్రమపుట్టునట్లు చేయవలెను. అట్టివారిని యెట్టయెదుట నిలుపవలెను. మనుష్యబలము మిక్కిలి బలిష్ఠముగాను దగినంతగాను నుండవలెను. కాని యందఱును నొక్క విధముగా యాదరింప గూడదు. వారి వారి శక్తినిబట్టి వారికి జిన్నతనము --కుండ వేఱువేఱు పనులు వారి కొప్పగింపవలెను. మహావీరు డాతని గౌరవము చేతను మహోత్సాహముచేతను బురికొల్పబడినప్పుడు వాడు తనప్రాణములనైన దెగించును. అట్టి శురులను గలిసి యేక ముఖముగ బనిచేయుటకై నిలువలో నుంచుము. భయంకరమైన బెబ్బులిబొబ్బ గొఱ్ఱె నెట్లు చెల్లాచెదరుగ జయునో చూడుము! తెగ బలిసిన దున్నపోతు లగుటవలన లాభము లేదు. మీరు పెద్దపులులు గండు. రాజులు రాజధర్మము గమనింపవలెను. క్షత్రియులు తమధర్మమయిన యుద్ధమును జేయవలెను. బ్రాహ్మణులు తమమతధర్మములను నిర్వర్తింపవలెను. రాజు సంగ్రామశాస్త్రమును నశ్వశాస్త్రమునుగూడ బఠింపవలెను. శత్రువులను జయించుట క-- సాధనము గనుక, మిక్కిలి యవసరము. నా ప్రభువైన శ్రీరామునిచేత బ్రేరేపింప బడి నా నేర్చినకొలదిని రాజధర్మమును గూర్చి పలికితిని.
పుట:SamardaRamadasu.djvu/74
ఈ పుట ఆమోదించబడ్డది