ఈ పుట ఆమోదించబడ్డది

సమర్థ రామదాసు

మొదటి ప్రకరణము

శ్లో|| యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌.

శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌.
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే.
                               (భగవద్గీత అధ్యాయము 4 శ్లో|| 6, 8)

ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మమునకు వృద్ధి కలిగినప్పుడును, నన్ను నేను సృహించుకొందును. (శ్లో|| 6)

సాధుజనులను రక్షించుటకును, దుర్జనులను నాశనము చేయుటకును, ధర్మమును సంస్థాపించుటకును, యుగయుగంబున నేను పుట్టుచుందును. (శ్లో|| 8) అని పై రెండు శ్లోకముల యభిప్రాయము.

ఈ పై వాక్యముల సత్యము ప్రతి యుగమునందు సకకల దేశములందు వ్యక్తమగుచున్నది. యూదుమతము భ్రష్టమైపోయినకాలమున నాదేశస్థులను బాగుచేయుటకై భగవంవంతుడు సలకలధర్మమూర్తియగు యేసుక్రీస్తును బంపెను. అలాగుననే అరేబియాదేశము నీతిభ్రష్టమై ధర్నశూన్యమైన కాలమున పరమేశ్వరుడు నీతిమంతుడును బరమ భక్తాగ్రగణ్యుడును నైన మహమ్మదును బంపెను. ఆమహమ్మదు, నీతిని ఏకేశ్వరారాధనమును ధర్మమును అరేబియా దేశమున నెలకొల్పెను. ఆవిధంబుననే భరఖండవాసులు యజ్నముల పేరుబెట్టి వేలకొలది జంతువుల హింసిచుచు ధర్మభ్రస్టులై పాదైపోవుచున్నపుడు గౌతమబుద్దుడు జనించి హిందూదేశ