ఈ పుట ఆమోదించబడ్డది

తముగా, రుచిగా నున్న దనియు, మరాఠీ భాషలోని పద్యకావ్యములు, గద్యకావ్యములు, మిక్కిలి ప్రభావవంతములై జ్ఞానదాయకములై యున్నవనియు, దమ సనాతన ధర్మము పరమపావన మగుటచే దాని ననుసరించిన వారికి మోక్ష పదమెంతో సులభ మనియు దమ భాషలోనే మతము, విద్య నేర్చుట సర్వోత్తమమనియు గూడ వారు బోధించిరి. అది విని జనులాయన పద్యములు జదువుకొని ధన్యులైరి. ఆ పఠనముతో నదివఱకు వారి హృదయముల నెలకొని యున్న నిరాశ నిర్మూల మయ్యెను. తమ దేశమునకు మేలైన కాలము వచ్చుచున్నదని మహారాష్ట్రు లందఱి హృదయములలో నాశాంకురములు మొలక లెత్తెను.


_______