ఈ పుట ఆమోదించబడ్డది

ముగ దలలు వంచి యా యోగికి నమస్కరించిరి. ఆతని బాల్యస్నేహితులు తమ పిల్లను వెంట బెట్టుకొని రామదాసుని జూడవచ్చిరి. పూర్వ---వారు రామదాసుని మిక్కిలి చనువుతో బిలిచి సమీపింపకుండ శిరసు వంచి చేతులు జోడించి దూరమున భయభక్తులతో నిలిచిరి.

రామదాసుడు కొన్ని దినములు తన తల్లితోను, సోదరునితోను వారి యాజ్ఞను దీవనలను బొంది, తాను దలపెట్టిన మహత్కార్య:ము వారికి దెలిపి. మహారాష్ట్ర ధర్మమును జనులకు బోధించుటకు నిల్లు వదలి కృష్ణానదీతీరమునకు బోయెను.


_______