ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

అస్మద్గురుభ్యోన్నమః.

శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరబ్రహ్మణేనమః.

సకలతత్వార్థదర్పనము.

ప్రథమ నిరుక్తము.

ఇష్టదైవ స్తోత్రము

రాజయోగ విద్య వి
చారాత్మక జనపయోధీ చంద్రమ భవసం
సారాటవి సుచి లక్ష్మీ
నారాయణ నిన్ను నామనంబున దలతున్.

దేవతా స్తనము

క. హరచతురాననల బొ దరులను లక్ష్మీహిమాద్రి తనయల మఱియున్

పరికించి శారదాంబను ; వరమతి నుతియింతు కావ్య వర్ధనమునకై.

కులగురుస్తుతి

క. పరికింపగాను మత్కుల గురువగు సల్లానికులయ కూపార నిశా

కరుడనగ వినుతిగాంచిన గురువరు రామానుజార్యు గొలిచెద నెపుడున్.

కారణాచార్య సన్నుతి.

చ. మాయను బాపి మోక్షపథమార్గము జూపగ జాలినట్టి నా

రాయణ మంత్రరాజము నిరామయ తత్వము దెల్పి నాపయిన్

చాయని కూర్మిగల్నిగ కృపాకరు వెంకటరామయార్యులన్

నాయదలోన నిల్పియు యనారతమున్ వినుతింతు భక్తితోన్

సుకవివినుతి

గీ. సకలలోకోపకారంబు సలుపగోరి కావ్యములు జేసి సత్కీర్తిగాంచినట్టి

వ్యాసవాల్మీకికవి కాళిదాసబాణ పరమయూరులకును జేతు వందనములు.

కవిస్తుతి

సందడి రామాహ్వాయ ప్రియ నందనుడను విష్ణుభక్తి నైష్టికుడను సా
నందుడ నాగన నాముడ పొందగ వేదాంతవిధుల బొగడెడివాడన్.