ఈ పుటను అచ్చుదిద్దలేదు

6

సూక్ష్మాంగము:- పది హేడుతత్వములతో గూడియుండునది సూక్ష్మాంగ మనబడును.

కారణాంగము:- ఈస్థూలసూక్ష్మములు రెండింటికి హేతుర్భూతమై అజ్ఞానస్వరూపమై యుండునది కారణాంగ మనంబడును.

యీవిచారమునకు ఫలంబేమనిన, ఆత్మ సాన్నిధ్యమునవున్న సూక్ష్మశరీరము చేతనే స్థూలశరీరద్వారా కర్తృత్వభోక్తృత్వములు జరుగుచున్నవని తెలియుటేఫలము.

8. అవస్థాత్రయము.

జాగ్రదావస్త, స్వప్నావస్త, సుషుప్త్యావస్త యీ 3 న్ను అవస్థాత్రయ మనంబడును.

జాగ్రదావస్తయనగా - మేలుకొనియుండుట.

స్వప్నావస్తయనగా - కలలుగనుట.

సుషుప్త్యావస్తయనగా - సుఖముగా నిద్రబోవుట.

ఇందుకు ఫలం బేమనిన, యీఅవస్తాత్రయమునకు ఆత్మ సాక్షియై యున్నాడని దృడముగా తెలియుట.

9. జీవత్రయము.

విశ్వుడు, తైజనుడు, ప్రాజ్నుడు యీ 3 న్ను జీవత్రయ మనబడును.

విశ్వుడు - జాగ్రదావస్తవాసుడు

తైజనుడు - స్వప్నావస్తవాసుడు

ప్రాజ్ఞుడు - సుషుప్త్యావస్తవాసుడు. గనుక, జీవత్రయమునకు ఆత్మసాక్షియై యున్నాడని తెలియుటయే ఫలము.

10. స్థానత్రయము.

భ్రూమధ్యము, కంఠము, హృదయము యీ 3న్ను స్థానత్రయ మనబడును.

11. అంగత్రయవిభజనచక్రము.

అంగత్రయము స్థూలము సూక్ష్మము కారణము
అవస్థాత్రయము జాగ్రత స్వప్నము సుషుప్తి
జీవత్రయము విశ్వుడు తైజనుడు ప్రాజ్ఞుడు
స్థానత్రయము భ్రూమధ్యము కంఠము హృదయము