ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సి.

విషముఁ జూచిన వేళ విషయుక్త మైన
             పదార్థంబు చూచినయట్టివేళఁ
దలఁకఁబాఱుచును గ్రోతులును రాచిలుకలు
             గొరవంకలుసు సారెఁ గూఁత లిడును
గన్ను లెఱఁగఁబాఱుఁ గలహంసలకునెల్ల
             మఱి మదంబునఁ జెంది మరియుఁ గొంచ
మదకోకిలంబులు మరణంబు సెందును
             వెన్నెలపులుఁగులు వేగ బడలు


గీ.

నిందు నొక్కటిచేనైన నెందు లెస్స
తాఁ బరీక్షించి ధారుణీధవున కెపుడు
భోజనము సేయఁదగు నిట్లు భోజనంబు
చేయుచుండినఁ బతి హాని చెందకుండు.

ప్రాఁతకామందకమున "లలిఁ జకోరములకన్నులు విరాగము లగు" ననుచోట “చకోరస్య విరజ్యేతే నయనే" యనుటకు రెండవకవి మరాళస్య యని పఠించుకొనియె.

287వ పద్యమునకు సరిగా రెండవకామందకమున—

సీ.

భార్యయింటికిఁ జని భద్రసేనుఁడు తొల్లి యామెతోఁబుట్టుచే హతుఁ డగుటయు
నాలిగృహంబున కరిగి కారూశుండు తనతనూభవునిచేతనె పొలియుటఁ
బ్రియురాలు విషముతోఁ బేలా లొసఁగిన వేగంబ కాశికావిభుఁడు పడుట
జడలోన దాఁచుకుండెడుకత్తి తెలియక రమణిచేతన విదూరథుఁడు చెడుట


గీ.

యటు కరాళాంజనము పూసి యద్ద మందె
మేఖలయు నీయ జారూప్య మేదినీశు
లవని వైరూప్యసౌవీరు లడఁగు టెఱిఁగి
యధిపుఁ డతివలయిండ్లకు నరుగరాదు.

అని చెప్పుటలో భద్రసేనుఁడు తనబావమఱఁదిచేఁ జంపఁబడె ననియు, కరాళాంజనము పూసిన యద్దమును, అందెయు, మొలనూలును బ్రయోగించి క్రమముగా జారూప్య వైరూప్య సౌవీరరాజులఁ దమతమభార్యలు చంపిరని రాజులకు దేవీగృహగమనము కవి నిషేధించుచున్నాడు. ప్రాచీనకామందకమున భద్రసేనుఁడు