ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేశారు. ఇట్లు చూపేట్టడం ఈ మహాకవుల సారస్వత సృష్టికి న్యూనత ఆపాదించుట కొరకుగాదు. ఏనాడు తెలుగుబాష హిమలయ తుంగ శృంగసమున్నతమైన ఈ రచనల్ని ఉపేక్షిస్తుందో అది తెలుగుబాష దారిద్ర్యానికే కాని ఆసారస్వతమూర్తుల ఇద్దకీర్తికెట్టి క్షతియలేదు. ప్రభుచిత్తవృత్తిలో రాయలు కొంత భాషా స్వాతంత్ర్యం కూడా పాటించినట్లు లాక్షణికులు భావిస్తారు. స్త్రీ వాచకములకు ఆకారాంతములకు సంధిచెయ్యడం, గంగనుకాసె, శ్రీరంగభర్తంచు, లఘిమందు, చేష్టుడిగివంటివి, అన్యదేశ్యాలు, వైష్ణసపరిభాషాపదాలు, అప్రసిద్ద సంస్కృతపదాలు వాడడం ఈయన రాజసలక్షణం. నానావిధ మనుష్యజీవితాన్నే కాక పశుపక్ష్యాదుల స్వభావాన్ని కూడా గుర్తించి వర్ణించడం ఈయన సల్లక్షణము. ప్రకృతి పరెశీలనలో కృష్ణరాయలను మించిన తెలుగుకవి లేడు.

  ప్రబంధయుగంలో రెండు భాషా ప్రయోగాలు జయప్రదంగా నిర్వహింపబడ్డాయి.  అందొకటి ఆంధ్రభాషకుగల ద్వ్యర్ధికావ్యంలో సూరనార్యుడు ఈ యద్బుత ప్రయోగం చేసి అమూలాగ్రంగా నిర్వహించినాడు.  ఇదియెంత కష్టసాధ్యమో కృతిపతిచేత చెప్పించాడు.

     "రెండర్ధంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
      కుండున్ దద్గతి కావ్యమెల్గనగునే నోహో యనంజేయదే
      పాండిత్యంబున నందునుందెనుగుశబ్బంబద్బుతం బండ్రు ద
      క్షుండెవ్వాడిల రామభారత కధల్ జోడింప భాషాకృతిన్ "

దానినెట్లా సాధించాడో ఆయనే వివరించాడు. సభంగశ్లేష, అభంగశ్లేష, సంస్కృ తాంధ్రభాషాశ్లేష మొదలైన పెక్కు రీతులు కల్పించుకొని నైపుణ్యంతో రెండర్ధాలు జోడిస్తూ రామాయణ భారతకధలు ఏకకావ్యంగా కూర్ఛాడు. ఉదాహరణకు - వినియతనిందనపై నిడుకొని - అనేదాన్ని (1) విని, అతనిన్, తనపై నిడుకొని అనియు (2) వినియత, నిందన, తనపై నిడుకొని అనియు వేర్వేరుగా పదచ్చేదం చేసుకొని రామభారతకధల పరంగా అంవయించుకోవాలి. పింగళి సూరనకు సమకాలికుడైన రామరాజభూషణుడు తన హరిశ్చంద్రనలోపాఖ్యానం లో ఇటువంటి ప్రయో