ఈ పుటను అచ్చుదిద్దలేదు

53

నన్నయ తిక్కన వారసులు

   భాషింతు నన్నయభట్టు మార్గంబున
      ఉభయ వాక్ప్రౌడి నొక్కక్క మాట
   వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
       భ్యుచితబంధముగ నొక్కక్క మాట
   పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని తేవ
       సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు“

శ్రీనాధుని శక్తి సామర్ధ్యాలు ఎట్లా ఉన్నా సాహిత్య శైలులు ఎన్నివిధాలుగా ఉండాలో మనకు చక్కగా తెలిపారు. దానిలో ఉద్దండరీతి, ఉభయవాక్ప్రౌడి, రసాభ్యుచిత బంధము, సూక్తి వైచిత్రి ఇన్ని ఉండాలి. కవిత్వం తేలికగా సర్వజనులకు అర్ధమయేటట్లు ఉండాలనడం కొంతవరకూ మాత్రమే గ్రాహ్యమవుతుంది. అది వట్టి పేలపిండివలె ఆద్యంతం ఉంటే అదిమాత్రం నిలుస్తుందా? నిలువదు. తెలిసినవారిచేత, తెలియనివారిచేతకూడా ఔననిపించుకునేటట్లు ఉండాలి. శ్రీనాధుని కాలంనుంచీ కవిత్వం విద్వాంసులు మెచ్చుకునేటట్లు ఉండాలనేభావంనిరూఢమం సామాన్య సాహిత్యానందం విస్మరింపబడింది. ఇక్కడే మనము వారితోభిన్నిస్తున్నాము. భీమేశ్వరపురాణంలో సత్కావ్యం ఎట్లా ఉండాలో శ్రీనాధుడు చెబుతున్నాడు.

    “హరచూడా హరిణాంక వక్రతయ
       కాలాంత స్పురచ్చండికా
    పరుషోద్గాడ పయోధరస్పుట తతీ పర్యంత కాఠిన్యమున్
       సరసత్వంబును సంభవించె ననగా సత్కావ్యముల్దిక్కులం
    ఉరకాలంబు నటించుచుండు గవిరాజీగేహ రంగంబులన్“
                              భీమఖండము 1-11

  కవిత్వ భాష ‘కట్టె కొట్టె తెచ్చె ‘ అన్నట్లు సూటిగా ఉండదు. అది ఈశ్వరుని మౌళియందలి అర్ధచంద్రునివలె వక్రంగాఉండాలి. కాలభామినీ స్తనతటమువలె మృదుకఠినంగా ఉండాలి. దానిలో రసానుకూలత ఉండాలి. లేకెపోతే ఆ కావ్యము కవిసమాజము వారి హృదయగేహములలో కలకాలం నివాసం చెయ్యదు. నిజమే, మహాకవి వచించినది ప్రత్యక్షర సత్యమే. నైషధము, భీమఖండ కాశీఖండములలో శ్రీనాధుని భాష రెండు పాళ్ళు ఉన్నత సంచ్కృతంగాను. ఒకపాలు మురిపెమైన తెలుగుగాను