ఈ పుటను అచ్చుదిద్దలేదు

  “ఉద్యానవనంబోలె బహువిద్రుమలకాలంకృతంబైనదాని, నాటకప్రయ గంబునుంబోలె మనవరసపాత్ర శోభిత రంగరమ్యంబైనదాని, దివంబునుంబోలె నహిమకరభరితంబైనదాని“
                                  (ఆది 227)

దీని నాధారంగా చేసుకొని అనంతర కవులు వచనంయొక్క ముఖ్య ప్రయోజనం బలిచేసి బాషా సంబందమైన గారడీలు చేస్తూవచ్చారు. పోతరాజిగారికి పధ్యరచనలో కొట్టవచ్చినట్లు కనపడేది అంత్యానుప్రాన ప్రీతి. ఇది సార్వత్రికంగా ఉంది.

   ‘పుణ్యుడు రామచంద్రుడటువోయి ముదంబున గాంచె దండకా
   రణ్యము,తాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లావణ్యము ‘

   ఇట్లాంటి రచనపై ఆయనకు మక్కువ, నన్నయ కాలపు భాషకూ ఇప్పటికీ క్రియారూపంలోస్వల్పమైన మార్పు వచ్చింది. భూతార్దాన్ని ఎను ప్రత్యయంతోకాని క్రియాజన్య విశేషణ పూర్వక తచ్చబ్డంతోగాని ప్రకటించడం నన్నయ పద్దతి.చేసినవాడు, చేసినయది ఈవిధంగా, ఉండినవాడు అనేరూపం బమ్మెరపోతన నాటికి సమీకరణం చెంది ఉన్నాడుగా మారింది

  “ఉన్నారా బలభద్రుడుగూడి సుభియై యుత్సాహియై ద్వారకన్ ‘
                                      భాగవతము

ఈమహాకవి రేఫఱకార సాంకర్యం చేశాడనీ, అందుచేత ప్రామాణిక కవిగా పరిగణింప బడడం లేదన్నట్లు అప్పకవి ఒక అభాండం వేశాడు. కూచిమంచి తిమ్మకవి దాని ఈ ఖండించినాడు. దీనికి మరొకవిధంగాకూడా సమాధానం చెప్పవచ్చును రేపద్యయ స్పుట శ్రవణము దీనికి మరొకవిధంగాకూడా సమాధానం చెప్పవచ్చును. రేపర్వయ స్పుట శ్రవణము పోతన నాటికి అస్తమిస్తూందని, లోకమర్యాదనే ఆయన పాటించాడనీ కూడాభావించవచ్చు. ఏమైనా నన్నయ తిక్కనల తర్వాత సర్వాంధ్ర జనామోదం పొందినకవి ఆంద్ర భాగవత కర్త యనడంలో రెండుమతాలు లేవు.ఆయన కల్పించుకొన్న సాబిత్యభాష తెలుగువారి హృదయాలకు మిక్కిలి సన్నిహితం. అనడంలో విప్రతిపత్తి లేదు.

  నన్నయ తిక్కనల వారసులము అని చెప్పొకొంటూనే వారి మార్గానికి దూర రేఖలలో ప్రయాణించినవారు నాచనసోమనాదుడు, శ్రీనాధుడు. నాచనసోముడు ఎఱ్ఱాప్రెగడకు అపర సమకాలికుడగుచున్నాడు. బమ్మెర పోతరాజు శ్రీనాధుని పూర్వవయస్సులో పైకి వచ్చుచున్నాడు. నాచనసోముడు కవిత్రయమునకు దీటైన