ఈ పుటను అచ్చుదిద్దలేదు

పామరులు వాడుకునే శబ్దరూపం గ్రామ్యమని చెప్పుకుంటారు. కవిత్వంలో దోషాల్ని ఎంత మాత్రమూ సహింపము అన్యదేశ్య శబ్దాలు కూడా రసవంతమైన విఅతే వాడుకోవచ్చును. గ్రామ్యం కూడా కొన్ని సందర్భాల్లో ప్రయోగార్హము అవుతూంది. కరకంఠుడు వంటి శబ్రాలు మాకు సమ్మతములు అని భావము. వ్యవహారంలోఉండే భాష అంతా గ్రామ్యమని అధర్వణుడు నిరసించక పామరులు మట్లాడే శబ్దరూపం గ్రామ్యమని వివరించడం బాగుంది. ఇటువంటి గ్రామ్యాన్ని కూడా కొన్ని సందర్భాలలో కవ్యంలో వాడవచ్చును అన్నాడు. అనగా గ్రామ్య పాత్రల సంభాషణమును అనుకరించి చెప్పేటప్పుడు వారి భాషయే వాడితే రసవంతంగా ఉంటుంది. పామరజనుడు శుద్ధ గ్రాంధికంగా మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది గమనించియే వేదం వేంకట్రాయ శాస్త్రులవారు తమ నాటకాల్లో నీచ పాత్రలకు వ్యావహారిక భాష వాడి రక్తి కట్టించారు.

     నుశబ్ద నిర్ణయంలో నన్నయ ఆనాటి విద్వత్పరిషత్త్లును ఏ సూత్రాలు పాటించారో తెలుసుకునే అవకాశం లేదు.  ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ పూర్వ వ్యాకరణమని విమర్శనలు అంగీకరించడంలేదు.  అందులో అక్కడక్కడ ఉదాహరింపబడిన వైయాక్జరణులు-అధర్వణుడు, కవి భల్లటుడు మొదలైనవారు నన్నయకు అర్వాచీనులే కాని పూర్వులుకాదు.  త్రిలింగ శబ్దాను శాసనములోను ఆంధ్ర కౌముది యందును బృహస్పతి కణ్వుడు అనువారు తెలుగునకు ప్రాచీన విఅయాకరణులైనట్లు చెప్పబడినను వీరి యునికి నిర్ధారితము కాలేదు.  వరు రచించిన గ్రంధములును కనబడవు.  నన్నయ భట్టారకుడు నూటయాభై సంవత్సరాలకు ముందే పద్యరచనా వ్యవసాయం దేశంలోసాగుచుండడం చేత ఏదైనా వ్యాకరణ రచనా ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపడవలసినది లేదు.  కాని స్థిరమైన సాక్ష్యమేమీ మనకు లభించక పోవడం చేత నన్నపార్యుడే తన మహోధ్యమానికి అవసరమైన భాషా నియమాలు చేసుకొని ఉంటాడని అనుకోవలసి వస్తూంది.  ఈ నియమాలు రెండు రకాలుగా ఉండినట్లు ఊహించవచ్చును.

1. తనకు పూర్వముండిన శబ్దస్వరూపాన్ని ప్రామాణికంగా గ్రహించడం

2. సమకాలిక శిష్ఠ సమాజంలో వ్యాప్తి యందున్న భాషా రీతిని8 అవలంబించడం.

  నిత్య వ్యవహారికంలోని భాష ఝురీవేగంతో మార్పును పొందుతూంటుంది. భాషా ప్రయోక్తల అనవదానత, ఉచ్చారణలోని అసామర్ద్యము, ఉచ్చారణ వేగము