ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో సాహిత్య భాషావతరణము

వినబడదుకాని ఆయన సమకాలిక శాసనాల్లోకూడా ఈ "ట" ధ్వనివాడబడుతూనే ఉండేది. అనగా వ్యవహార భాషలోఉండేది. అగ్రవర్ణాల భషలో తొలగినట్టుంది. ణకారము (అణావంటి మాటల్లోనిది) నన్నయపూర్వభషలో తరుచువాడబడేది. పనిఅనడానికి పణి అని పలికేవారు కావచ్చును. దంత్యనకారము, శకటరేఫ కలిసిన సంయుక్తవర్ణం "న్ణు" అనేది కాలక్రమంలో "ండు, డు" గా మారింది. పుత్రున్ణు అనేది పుత్రుండు, పుత్రుడుగా పరిణమించింది. దీనినే మనము మహద్వాచక ప్రధమ ఏకవచనంగా చెప్పుతున్నాము. కుంటి "ళ" వర్ణము కూడా నాడు విశేషప్రయోగంలో ఉండేది. కొణుకళే అనే మాట ఇప్పటికొడుకులు అనే దానికి ప్రాచీనరూపం - ఇందులో చివరఉన్న కళేప్రత్యయము బహువచన ప్రత్యయము. ఇదియే తరువాత ళు, లు గా మారించి. తరువాతి కాలంలో లు వర్ణమే బహువచన ప్రత్యయంగా ఎక్కువ వాదుఇకలోకివచ్చింది. పైన చెప్పిన "ట" ధ్వని అనంతర శతాబ్ధాలల్లో పెక్కు మార్పులకు లోనయి చివరకు నన్నయ భారత భాషలో విడువబడింది. ఇది ఒకప్పుడు రేఫగా మార్పుచెందింది. పుఱోలు అనే మాట వర్ణ వ్యత్యయంచేత ప్రోలు (పట్టణము)గా రూపొందింది. అ కారము ఱ, ర, గా మారినదన్నమాట. ఒకప్పుడిది డ కారంగా తయారయింది. చోటి, కోటి మున్నగు శబ్దాల్లో ఇది చోడి, కోడి రూపాలను ఎత్తింది. ఒకప్పుడిది పదారంభంలో కూడా వాడంబదేది. దీని సరియైన ఉచ్చారణ ఇప్పుడు మనక్ తెలియదు. తమిళభాషలోకూడా ఇది ఉండడంచేత దానికి దగ్గరయైన ఉచ్చారణ దీనీ ఉండేదని ఊహించాలి. "ఱేందులూరు అనేది ళెందులూరు, డేందులూరు అయి ఇప్పటి మన దెందులూరు రైల్వేస్టేషన్ గా మారింది. ఇద్ ఏలూరు ప్రక్కన ఉన్న గ్రామము. ప్రాచీనాంధ్రభాషకు చెప్పబడిన విశేషార్ధాల్ - ట, ఱ, ణ, ళ - అరవ కన్నడభాషల్లోకూడా ప్రచురంగా ఉన్నాయి. అందుచేత తెలుగుబాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని భాషా శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. ఈ యొక్క సామ్యమే కాదు, ఇతర సామ్యములు చాలా ఉన్నాయి. పూర్వశాసనాల్లోని కొన్ని గ్రామనామములు - విరిపఱ (తరువాత విప్పర్రుగామారింది షాణూర, కూడుర, దాలూర, ఆతుకూరు. తాఱకొన్ణ (తాడికొండ ఏలూరు, చెంచెరువ కంటురాంచెరువ (కమ్మరి చెఱవు). రేగోన్దము (రేగొండ), పెణుకుపఱ్ఱు పులొంబూరు (పొలమూరు) ఇత్యాదులెన్నో కలవు. వ్యక్తి నామములు, అగ్గిజ్జ, భానజ్జ (ఆయకాపూర్వ రూపము అజ్జు), గొలశర్మ, కొట్టిశర్మ, కొట్టిశర్మ వంటివి. బిరుదుపదాలు మహా తల వర, మహాతగవర (తవగరి -న్యాయాధీశుడు) వంటివి.