సంధ్యాసమయమును సంపూర్ణముగఁ జంపుచున్నారు. మనుజహృదయము నఫై యట్టెజె వ్యాపింపఁజేసి, యట్టె యట్లై విశాలమగునట్లు చేసి ప్రకృతి పరీవాహమున లీనమగునట్టు చేయఁగల సన్నివేశములు సృష్టిలోఁ బ్రధానముగ రెండున్నవి: మొదటి దాకాశము; రెండవది సముద్రము. కన్ను తనివి లేకుండ జూడఁ దగినది మొదటిది మిన్ను; రెండవది మున్నీరు. సంధ్యాకాలమున నీరెండును మదరాసులోని తిరువళ్లిక్కేణి ప్రక్క నెంత మహాసౌందర్యసమ న్వితములై యుండునో యనుభవింప వలసినదే కాని వచింపఁ దరమా? అట్టి పరమోత్కృష్ణ మైన స్థలమునఁ జేరినజను లేమిచేయుచున్నారో విందురా? అత్తగా రాండు బిడ్డవీరలకై యింటిలో బియ్య మమ్ముచున్న దని భర్తతో భార్య చెప్పచున్నది. సంసారచౌర్య కథనము సముద్రతీరముననే కాని సముచితముకాదా? ప్రకృతి సౌభాగ్యరంగమునం బనికిమాలిన పడమటింటి గొడవ యెందులకు? ప్రకృతి సౌందర్యగ్రహణశీలుం డగుభర్త భార్య మాటలు వినుచుఁ బల్లెవానితో రొయ్యపప్పు బేరమాడుచున్నాఁడు. పాఠశాలలలోఁ జదువుకొనుచున్న బాలురు నారీకలాశాలలలోని వితంతువుల వింతలు చెప్పకొనుచు వెకవెకలాడు చున్నారు. నాలుక యల్లాడు చున్నంతకాలము నారీమణి నధిక్షేపింపజాలని మూఢుఁ డెవఁడు? ఆమా టలు రవంతవిన్న యొకయాంద్రోపాధ్యాయు డచ్చటి యబలాసంఘము లందలి యద్బుత సన్నివేశములవంటివి మఱెక్కడ నుండవని తా నుంచుకొన్న పూటకూటింటి వూవుబోడికి బోధించెను. ప్రభువులపై, బడతులపై బనికిమాలిన ప్రసంగము లొన ర్చుట కేమంత ప్రయోజకత్వము కావలయును? నోటిలోఁ జేయిపెట్టినం గఱవ జాలని శక్తిహీనుఁడైన నందులకు సమర్ధుఁడే కాదా? మఱియొక చోటఁ గొందఱు సై మనువ్యవహార సందర్భమునం దురకలనోటనుండి వెడలిన బూతులఁ గూర్చి, చేతినుండి వెడలిన చెడావులంగూర్చి చెప్పకొనుచున్నారు. ఇటులె పనికిమాలినవార్తలతో, దిక్కుమాలిన సోదె లతో, నవకతవక గాథలతో, ననర్హము లయిన యెత్తిపొడుపులతో నచ్చటివారు కాలక్షేపమొన ర్చుచున్నారు. పెద్దపీఁత కాలిపై బ్రాఁకఁగఁ గంపమంది గగ్లోలయి యెగురబోయి నెత్తిపై ముసుగు జాఱి గ్రిందఁబడిన వితంతు నారీమణిని గాంచి హేహే హే యనువారె కాని రాజధానీకళాశాల వెనుక నారికేళవృక్షముల తోఁపులో సహస్రకోటిజపాకుసుమతేజో రాశియై యధఃపతన మందుచున్న నభోమణిని గాంచి హాహాహా యను వాఁడైవండైన నున్నాడా?
ఈగొడవ నా కెందుల కని యిట్టి మహావిచిత్ర ప్రకృతి కధీశుండగు పరమేశ్వరుని నముద్రపుహోరు సుతిగఁ జేసికొని గాన మొనర్చుకొనుచు నుత్తరదిశాభిముఖుడనై కొంత దూరము పోయితిని. అక్కడ బాడిదెకఱ్ఱ తెప్పపై నొక్కడు కూరుచుండి యున్నాడు. అతడు ఖాదీవస్త్రములను ధరించి యున్నాఁడు. ఎవడో దేశభక్తుఁడు, దేవభక్తుఁడని నిశ్చయించుకొని యాతనియొద్దకేంగి నిలువబడితిని. నన్నుఁ జూచియాతడిట్టనియెను:
“బైఠో బైఠో భే!.....కూతుకొండు రాయరే కూతుకొండు. ఆడడా! ముత్థాన్-ఉకార్ —ఉకార్-బన్ కూరుచుంటివా బన్-కం. ఊరక రారు మహాత్ములు, మీరలు మాయింట కిపుడు మేలొనఁ గూడెన్, గూరిమి మీఱిన పలుకుల, ధోరణితో విం దొనర్చి తుష్టం జేతున్. ఆశుకవిత్వము చెప్పఁగలవయ్యా? 'సీ. బిరుదైన కవిగండ పెండేరమున కీవ తగుదని నాదుపాదమునఁ దొడిగెనని యన్నవాఁడు పెద్దన్నయే కాదా? తాళ్లపాక చిన్నన్న యుండుటచేతనే యాతండు పెద్దన్నయైనాడు. Relativity of knowledge అనంగ నిదియే