జూచుటకుంగన్నే యున్నయెడల మనదేశమునకీ మహాదుర్గతియేల? ఇతర రాష్ట్రములలోని వారు వారి రాష్ట్రములను వా రేలుకొనుచుండ, మనమేమి చేయుచున్నాము. మనమేడ్పులను మన మేడ్చుచున్నాము. బొంబాయి రేవులో నుండి పాగయోడలోనికిఁ జేరినయెలుక ప్యాసుపోర్టు అక్కఱలేకుండ ఏ అమెరికాదేశమునకో యింగ్లాండునకో పోవుచున్నదే ఎలుకకున్న జన్మస్వాతంత్రమైన హిందువునకు లేదే.
సాక్ష్యపన్యాసములు తిరుగ నారంభింపఁబడిన వని వినఁగనే యీపిచ్చి యాసుపత్రిలో నివారందఱేమిచేసినారో యెఱుఁగుదువా? వారందరు ‘ది ఫిలాసఫర్సుకాన్పరెన్సు అను పేర నొకసభచేసి సాక్ష్యుపన్యాసములు పడుచున్నంతకాల మాంధ్రపత్రికను మనము తెప్పించు కొంద మని తీర్మానించుకొని యట్టు తెప్పించుకొనుచున్నారు. మతియున్న వారికంటె మతిలేని వారికే నీయుపన్యాసము లెక్కువ రుచించునట్లు కనఁబడుచున్నదే! నీవుకూడ వారిజట్టులోని......"
"కోన్ రే వహాఁ దివానాసే గుప్తగో కర్తా హై జారే యని యొకమహమ్మదీయు డఱచెను. నేను వెడలివచ్చితిని.
నాయనలారా! సృష్టిశక్తులనుగూర్చి యీతడు చెప్పినమాట లన్నియు మీతో జెప్పితిని. ఈమాటలు మీ కెట్టున్నవో కాని నాకు సమంజసముగఁ గనబడలేదు. ఈయపన్యాసమును గఠినముగ విమర్శింప వలసియున్నది. ఈత డింక మతిలేనివాఁడు కాలేదు. కాని మనుజ దూషకుడైనాఁడు. నిష్కారణముగఁ దనకు గారాబంధమును గలుగ జేసి, యవమానించిన మనుజులను శిక్షింపలేదని దేవదూషణమునకు గూడఁ బూను కొనినాడు. ఈతలతిక్క తత్త్వజ్ఞాన మిందుమూలమునఁ గలిగినది. ఇతనికిఁ గారాబంధమో క్షము వేగముగ నగుఁగాక!
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.