ఈ పుట ఆమోదించబడ్డది

యంత వఱకే యితరులతో సంబంధము యాజ్ఞవల్క్యమహర్షి యెంత సత్యములైన మాటలా డెనో యెఱుంగవా? నీసుఖముకొఱకే నీభార్యను నీవు ప్రేమించుచున్నావు. నీసుఖముకొఱకే నీవు నీపుత్రునిఁ బ్రేమించుచున్నావు. నీకు యథార్థమైన ప్రేమము నీయందే తక్క నితరు లెవ్వరి యందును లేదు. ఇవి యెంత వింతగఁ గనబడుమాటలో యెంత సత్యము లైనమాటలు! వీనిసత్య మెట్టిదో రవంత పరిశీలింతము.

రెండేండ్లపిల్లవాని తత్త్వమును బరీక్షింతము. అంతపిల్లవాని నేల పరీక్షింపవలయు ననంగా, నాతనిలోఁ బ్రపంచసంబంధమైన మోసము, దాంభికము, మాయ, యిచ్చకము మొదలగు నేదోషము లింక సంక్రమింపలేదు. సాంకర్యరహితమై స్వచ్చమై సహజమై యతనితత్త్వము పుట్టినది పుట్టినట్టున్నది. ఇదియే పరీక్షింపదఁగిన సమయము. ఆదర్శ స్వచ్చతను దెలిసికొనవలయు నెడల దానిపై మాలిన్య మేమియుఁ జేరనప్పుడే పరీక్షింపవల యును గాదా! గాలిలోనిచెమ్మ దానిపైఁ జేరకుండునప్పుడే పరీక్షింపవలయును గాదా! ఎదుటను బ్రక్కనున్న వస్తువుల చాయలు దానిపై బడకుండునప్పడే పరీక్షింపవలయును గాదా! పుట్టుకతోఁ బుట్టినగుణము లేవో తెలిసికొనఁదలచినయెడల నట్టిబిడ్డనే పరీక్షింపవల యును. బిడ్డచేతి కద్దమిచ్చిన సరే, బొమ్మనిచ్చినసరే, మఱియేది యిచ్చినసరే, దాని నేల నడఁచికొట్టును. నాశన మొనర్చుటయే దానిప్రకృతి యని తెలిసికొనవలసినది. ఎవఁడైన మఱియొక పిల్లవాఁడు తనయొద్దకు వచ్చునెడల వానిని గొట్టి పీఁకినదాఁకఁ దహతహలాడి పోవును. సహజజాతితో సంతత వైరమే మనుజప్రధానగుణమని తెలిసికొనవలసినది. తనతల్లి క్రొత్తగ వచ్చినపిల్లవాని నెత్తుకొనువఱ కక్కఱలేదు. దరిఁజేర్చుకొన్న యెడలఁ దల

గొట్టుకొని యేడ్చును. తనస్థితి నెవరైన నాక్రమింతురేమో యను నసూయయే ప్రధానగుణ మని తెలియఁదగినది. తండ్రి పెద్దమిఠాయి పొట్ల మింటికిఁ దీసికొనిరాఁగ, నన్నకొక్క యుండ పెట్ట వలనుపడునా? అక్క కొక్కయుండ పెట్టవలను పడునా? పొట్ల  మంతయు దనచేతి కీయవలయును. ఇచ్చినదాఁక నింటిపెంకు లెగుర గొట్టుచునే యుండును. కేవలము స్వార్థలోలతాగుణ మిందు జాజ్వల్యమానముగాఁ బ్రకటన మగుచుండుటలేదా? కేవలము పిల్లవాఁడు కావునఁ గ్రమ్ముకొనుటకు మోస మెఱుఁగనివాఁడు కావున నతని స్వార్థసలోలత బట్టబయ లొనర్చుకొనినాడు. వాఁడే పెద్దవాఁడగుపిమ్మట నట్టు పలుకునా? అట్లాచరించునా? మోసకాఁడై కపట ప్రేమఁగల చూపుల జిలుకుచు నళికవైరాగ్యప్రతిపాదక ములగు పలుకులఁ బలుకుచు మాయానమస్కృతులతో, మాయాపరీరంభములతో, మహా మాయామందహాసములతో నాపాదశిరఃపర్యంత మాక్రమించిన స్వార్థల్లతను మాటు జేసికొని యంతయు మీదే యంతయు మీదే యని వట్టిచేయి వారివంకద్రిప్పి సర్వముఁ దానే కబళించును. మాటలు బైరాగిమాటలు. తిండి దయ్యపుతిండి. ధరించినది శాటి. వరించినది బోడి. చదివినది వేదము. చేసినది ద్రోహము. స్వార్థపరత్వమే నరుని ప్రధానగుణ మనుట స్పష్టము. పరోపకార మెటనైన నెప్పడైన గనబడినట్లున్న యెడల నదికూడ మారువేసమందిన స్వార్థపరత్వమే కాని మరియొకటి కాదని నిశ్చయముగ నమ్మవలయును. పైని పాదరసము రాచిన రాగిడబ్బు. కరకరంగుపూసిన ముసలిమీసము. సృష్టిలోఁ బ్రేమను గూర్చి యిది చాలును.

ఇంక సృష్టిలోని క్రమమునుగూర్చి చెప్పెదను. మూలకారణమగు ననిర్వచనీయమైన