యంతవేడుకతో నాతని వెంబడింపఁగలదా? ఉరికంబములయొద్ద కాతని మఱియొక్కఁ డీడ్చుకొనిపోవునెడల నింతయుత్సాహముతో నాతండు నడచునా? చంపుటకై తన్నుఁ దీసికొనిపోవుచున్నాఁ డని యది గ్రహింపకున్నదా? పెంచుకొనువాఁ డెవండో చంపువాఁ డెవఁడో యది యట్టె గ్రహింపఁ గలదే! దానికున్న తెలివికంటె నాతనితెలివి యేమంత హెచ్చు తన తనువును బాడు సేయుచుఁ దనధనము దోచుకొనుచు, వంశమర్యాదను వల్లకాఁడుచేయుచుఁ గీర్తిని భ్రష్టపఱచుచు సర్వవిధములఁ దనగొంతుకోయ సంకల్పించుకొనిన కులటాధనమను దనప్రాణరక్షకదేవతగఁ జూచుకొనుచు, గౌరవించుచు నారాధించు చున్న యీనిర్బాగ్యుఁడు గొఱ్ఱె కంటె నెట్లెక్కువ తెలివిగలవాఁడు? ఆహా! ప్రక్కనే త్రిపురాంతకుండగు మహేశ్వరుని యాలయ మున్నదే మోక్ష ప్రదాతయైన యాదేవతాసార్వ భౌముని పాదపద్మముల నాశ్రయింపక ముఱికితొత్తు పృష్ఠ మాశ్రయించిన బుద్దిహీను నే మనవలయును?
గొఱ్ఱె గుంజుకొనుచు వెనుకకుఁ దగ్గుచున్నది. విటుఁడు హుంకరించుచు ముందునకు లాగుచున్నాఁడు. "బే ఏ ఏ ఏ" యని గొఱ్ఱె యాతనిహృదయము కరఁగునేమో యని యేడ్చుచున్నది. గుడిసెవ్రేటిదాని బుడిబుడిబొల్లి దుఃఖములకుఁ గరఁగిన బొజఁగుల రాయఁడు-ప్రాణోత్ర్కమణసమయమున నోరులేని ప్రకృతి యొనరించిన యమాయక మైన యార్తిపూర్ణమైన యాక్రోశమునకుఁ గరగుఁటే! పరీక్షించుటకుఁ గన్నున్నయెడలఁ దెలిసికొ నుటకు మనసున్న యెడల నజ్ఞమగు జంతు ప్రపంచముతోడనే కాదు, దూరమని మనమను కొనుచున్న శాఖాప్రపంచముతోఁగూడ మనకున్న సంబంధ మెంతగాఢమో, యెంతనిర్భేద్యమో యెంతయన్యోన్యాభివృద్ధికరమో కొంతయైన గ్రహింపవచ్చును.
త్రాడుతైంపుకొని గొఱ్ఱె దేవాలయములోఁ దూఱినది. అటు బ్రహ్మయ్యగారిచేతిలో మూతిపెట్టి నిలువఁబడినది. సెబాస్! చతుష్పాదమా! నీవు ధన్యజన్మమవు. ప్రాణప్రయాణసమయమున నీకుఁ బరమేశ్వరదర్శన మైనది. గొఱ్ఱెవయ్యును. బ్రహ్మయ్యగారి వ్రేలనున్న నందికేశ్వరునిమూర్కొనుచున్నావు. శంకరభక్తుఁడెవండో సానిమగఁడెవఁడో కనిపెట్టుటకు మీజాతి కెంత తెలివియున్నది! అతని యొద్ద హాయిగ నిలువఁబడితిని. ఇతనిని వదల్చుకొనుదాఁక తహతహ లాడితిని! తుద కితనిత్రాడు త్రెంపితివి. ఓవిటాధమా! నీవెప్పు డీయాలయములోనికిఁ బోవలేదు కదా! గొఱ్ఱెను దెచ్చుకొనుటకై యిప్పడు పోఁదలఁచి తివా? త్రిపురాంతకదర్శనమువలన నీకు లభింపవలసినది గొఱ్ఱె బొచ్చా! ఆగొఱ్ఱెను దెచ్చు కొని నీఱంకులాడిమొగమునకు దిగదుడిచి చంపుదావా? నీపుణ్య మేమనవచ్చును? అదిగో యాతఁడు గుడిలోనికి రాఁబోవుచున్నాఁడు. బ్రహ్మయ్యగా రాఁగు మాఁగు మని గద్దించుచు న్నారు. అదరిపడి నిలువఁబడి యాతం డేమనియెనో విందురా? "ఈగొఱ్ఱెనాది. దీనిని నేను గొంటిని. నాసానియారోగ్యార్థమై దీనిని బలి నిడ దానియింటికిఁ దీసికొని పోవుచు న్నాను. నాగొఱ్ఱె ను నా కిటుతోలిపెట్టుము' ఇట్లాతండు పలుక, నాయనా! నేను దీనిలోని కాహ్వానించితినా? నేనేల పొమ్మని తోలిపెట్టుదును? ఇది ప్రాణభీతిచేఁ బరమేశ్వరాలయము చొచ్చినది. దీనిని జంపఁదగదు. ఇది నన్ను శరణు చొచ్చినది. శంకరదాసుఁడ నగు నేను దీనిని వదలను. నీకు దీనికై యెంత సొమ్ము కావలయునో యంతయు నిచ్చెదను. నీ వీగొఱియపై నాశ వదలుకొని పొ" మ్మని బ్రహ్మయ్య బదులు చెప్పెను. “నీకు మతి