ఈ పుట ఆమోదించబడ్డది

చేతులు ప్రక్కను వ్రేలాడుచుండునెడలఁ బ్రమాదవశమున మానరక్షణ ప్రయత్నముచేసికొనఁబ్రయత్నించుట సిద్దించునేమో యని భయపడినదియై, రెండుచేతులు పైకెత్తి మానభంగచింత లేశము లేనిదియై, “శంఖచక్రపాణీ!" యని మహార్తితో నాక్రోశించిన ప్పుడు కదా శ్రీకృష్ణభగవానుఁ డామె నుద్దరించుట సిద్దించినది! ఆపన్న రక్షకై శంఖచక్ర ములు చేతుల ధరించిన నీవు నన్నిప్పడు రక్షింపకయే పోవునెడల నీచేతులనున్న శంఖచక్ర ములు నాచేతుల గాజులవంటివేయని తెల్పుటకుఁ జేతులు పై కామె యెత్తినదని బుద్దిమంతు లగు వ్యాఖ్యాతలు చమత్కరించిరి.

నాయనలారా! దృఢచిత్తము మాత్రము మన కుండవలయును. దృఢచిత్తుడు కానివాఁడిహమునకుఁ బనికిరాడు; పరమున కంతకంటె బనికిరాడు. భగవత్కరుణ యందు, భగవద్రక్షణశక్తియందు బరిపూర్ణమగు విశ్వాస ముంపవలయును, నిశ్చలవిశ్వాస మున్నవా డెన్నఁడు చెడియుండలేదు. అవిశ్వాసి యెన్నఁడు బాగుపడలేదు. “సంశయా త్మావినశ్యతి" యనుమాట నిశ్చయము. శ్రీకృష్ణభగవానుఁడు పరమదయాళుఁడై ప్రాణిలోకమున దరింపఁ జేయుటకై ప్రపంచమున కంతకుఁ గటాక్షించిన భగవద్గీతయందు దేజోమయములగు నక్షరములతో నిట్టున్నది.

శ్లో.

మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్ధిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ-అత ఊర్ధ్వం న సంశయః

సెబాస్! ఇంతకంటెఁ గావలసినదేమి? “నీబుద్ధిని, నీమనస్సును నాయందే నిరంతర ముగ నుంపుము. నీవు నిస్సంశయముగా నాయందు నివసింపఁగలవు" అని భగవంతుఁ డానతిచ్చినాఁడే, సమస్త కష్టభూయిష్టమైన ప్రపంచనివాసమును వదలి సచ్చిదానందమయ తత్త్వమున శాశ్వతముగా నివసించుటకంటె జన్మమునకుఁ గావలసిన దేమి?

ఒకవేళ మనస్సును, బుద్దిని నాతనియందే నిరంతరముగ మనము నిలుపలేకపోవునె డల నేమి చేయవలసినదను సందేహము మనకుఁ గలుగునేమో యని తా నెంచి,

శ్లో.

అథ చిత్తం సమాధాతుం నక్నోషిమయి స్థిరం,
అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ.

అని సెలవిచ్చినారు. అట్టభ్యసించుటగూడ మనకుఁ గష్టమగునేమో యని,

శ్లో.

అభ్యాసే ప్యసమర్థోసి మత్కర్మపరమో భవ,
మదర్ణ మపి కర్మాణి కుర్వన్ సిద్దిమవాప్స్యసి.

అట్లు తననిమిత్తమై కర్మములుగూడ మనము చేయలేకుండు నెడల.

శ్లో.

అదైవ మప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత,
సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.

అని సెలవిచ్చిరి. మనము చేయు సర్వకర్మముల ఫలములుకూడఁ గృష్ణార్పణ మొనర్పవలయును. కర్మఫలత్యాగముకూడ మనకు మహాకష్టమనుట నిశ్చయమే. దమ్మిడి నిచ్చి క్రొత్తడబ్బు లాగఁజూచుచున్న మనము, గోచి నిచ్చి గొంగళిని గ్రహింపఁ జూచుచున్న