ఈ పుట ఆమోదించబడ్డది

మెఱసినంతలో వచ్చి యెగిరి గజేంద్రునిఁ బండ్లతోఁ బీకినది. ఆతడు దానిని దంతములతో ధట్టించినాఁడు. ఇది ముందు లాగ, నతఁడు వెనుక కీడ్వ, నది మీది కెగుర, నతఁడు తప్పించుకొన, నది కఱవ, నిత్తండు కొమ్ములతోఁ గొట్ట నిట్లు సహస్రదివ్యవర్షములు గజేంద్రమకరేంద్రులు హోరాహోరిగఁబోరాడ గజేంద్రునకు బలము క్షీణించెను. మొసలి డస్సియు స్థానబలముచేఁ బటిష్టమై యుండెను. మొసలి ముందునకు లాగుచున్నది. నీరసించిన గజేంద్రుఁడు వెనుకకుఁ బోవ గింజుకొనుచున్న వా డైనను మొసలిలాగిన ముందునకుఁ బోవుచున్నాఁడు. గజేంద్రునకుఁ గాళ్లు పూర్తిగ మునిఁగిపోయెను. మొనలి యింకను ముందున కాకర్షించుచున్నది. గజేంద్రుడు బలహీనుఁడయ్యును నింక మొరా యించి వెనుకకుఁ దగ్గుచునే యున్నాఁడు. గజేంద్రునిశరీర మంతయు నీట మునిఁగినది. ఈదంగలిగినను నాతనికిఁ గాళ్లు తేలిపోవుచున్నవి. ఇంతలోఁ దలకూడ మునిఁగినది. తుండమునకుఁ జివరనున్న ముక్కఱములు మాత్రము నీటిమట్టమున కొక్కడుగు పైను న్నవి. ఇంక నొక్క యీడ్పుతో సరి యన్నట్టున్నది, అప్పడు.

శో.

పరమాపదమాపన్నో మనసా చింతయద్దరిం
సతు నాగవర శ్రీమాన్ నారాయణపరాయణః.

సర్వకణప్రయత్నమును బూర్తిగ విడుచుకొని నారాయణపరాయణుఁడై శ్రీమంతుఁడైన గజేంద్రుండు పరమాపన్నత నొంది శ్రీహరి మనసారధ్యానించెను. సర్వేంద్రి యములు మనస్సు బుద్ది యాత్మయుఁ బరమేశ్వరునియందు లీనమొనర్చి యొక్క క్షణకాలము ధ్యానింపఁగఁ దనపుట్ట మునిగిపోయినట్టు, తనకొంప గూలి నట్టు లొక్కయెగురున

మ.

సిరికిం జెప్పఁడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగడతిం బన్నింపఁ డాకర్ణికాం
తరధమ్మిల్లము చక్క నొత్తండు వివాదప్రోద్ధతశ్రీకుచో
పరిచేలాంచలమైన మీడఁడు గజ ప్రాణవనోత్సాహియై.

అట్టి మహావిష్ణువు ప్రత్యక్షమై గజేంద్రుని రక్షించెను.

మరియొక యుదాహరణము చెప్పెదను. ఏకవస్త్రయైన ద్రౌపదిని దుశ్శాసనుడు కబరీవికర్షణ మొనర్చి సభలోని కీడ్చి తెచ్చి యా మహాపతివ్రత వస్త్రము నొలుచున్నాడు. అతఁడు పైట లాగుచున్నప్పడు కత్తెరమాదిరిగ నీమెచేతు లడ్డుపెట్టుకొనుచున్నది. ఆత డీమెచేతు లూడిపోవునట్టు చెఱఁగు గట్టిగ లాగుచున్నాఁడు. ఈమె వంగుచున్నది. ఇంకను లాగఁబోవఁగ ముడుఁచుకొని కూరుచుండుచున్నది. కొప్పుపట్టుకొని యామె నాతండు పైకి లేవదీయంగ, నొకచేతితో శిరోజములు పట్టుకొని, యెుకచేతిని జందెముమాదిరి వక్షమునం దుంచుకొని, యొకతోడపై రెండవతొడ హత్తించి, రవంత వంగియున్నది. మానరక్షణమున కెన్నిపాటులైనఁ బడుచున్నది. ప్రక్కకొత్తిగిల్లుచున్నది. గరిగిర తిరుగుచు న్నది. ఏమిచేసినను మహాపాపాత్ముఁ డగు నాతండు తనదుష్ప్రయత్నమును మానలేదు. మానప్రాణము నొక్కసారి యిఁక నొక్కపావుగడియలోఁ బోవునని నిశ్చయించుకొని, స్వరక్షణ ప్రయత్నమున లాభములేదని పూర్తిగ గ్రహించి, దానిని బరిత్యజించి, రెండు