రియై, బ్రహ్మవర్చసము ముఖమున ఠవణింప నుపదేశముద్రను వహించి, యుపనిషత్సార మును బోధించుచు నొకపుడు, చిలువెండ్రుకలతో, పాలబుగ్గలతో, నోటిచొంగతో, కంటికా టుకతో, మాటిమాటికి పైకెత్తుచున్న నడుముతో, చమురుతలతోఁ, దొట్టిలోని బొత్తులలోఁ బండుకొని వ్రేలు నోటబడక వెక్కివెక్కి యేడ్చుచు నొకపుడు నిట్టు భావనాప్రపంచమున, భావనానాటకమున, భావనారంగమున సర్వవేషధారియై బాహ్యప్రపంచాతీతుఁడై తన ప్రపం చమునఁ దా నొక్కఁడై సర్వమై యుండునాతఁడు కవి,
ఎదుట లేనివస్తువుల వర్ణించునపు డాంతరదృష్టితో, వజ్రధారకంటె వాఁడియైన యాంతరదృష్టితో, నావస్తువుల యాకృతి, రంగు, రుచి, వాసన, ధ్వని, స్పర్శము మొదలగునవి పరిశీలించి వాని బాహ్యాంతస్స్వరూపముల నెట్టయెదుటఁ బెట్టఁగల యింద్రజాలమహేంద్ర జాల విద్యావిశారదుఁడగునాతండు కవి. ఏయేవస్తువుల నెట్లెట్లు వర్ణించిననవి స్వస్వరూప ములతోఁ బ్రత్యకము లగునో యట్టి చాకచక్యసంపత్తితోఁ గొన్నిటిని బలిష్టములైన నాల్గు జటకాలతోనో, కొన్నిటిని బలిష్టములైన మూఁడు వ్రేతలతోనో కొన్నిటిని దేలికతేలిక లేఁతలేఁత యగు పదివ్రేటులతోనో నిర్మించి యెంతదూరముననో యెన్నిమూలలలోనో దాగియున్న వానిని సాక్షాత్కరింపఁ జేయఁగ సమయానుసారశబ్దార్థగుంభనాసమర్థుఁడగు నాతండు కవి. ఎవనిబొమ్మలు మాటలో యతఁడు చిత్రకారుఁ డగునట్టే యెవనిమాటలు బొమ్మలో యతఁడు కవి.
నాయనలారా! కవియొక్క ప్రధానశక్తులను జెప్పచున్నాను. ఇట్టిశక్తుల కుదాహరణ ములు మనభాగవతభారతరామాయణాది గ్రంథములనుండి యెత్తిచూపునెడల నాల్గుదినము లకైన నీయుపన్యాసము తెమలదు. కవిలక్షణములను మాత్రమే చెప్పెదను. లక్ష్యములను మీరు చూచుకొన వలయును. (అయ్యా మీపూర్వోపన్యాసములం దెన్నిటిఁ గూర్చియో చెప్పెద నని వాగ్దాన మొనర్చియున్నారు. ఈసందర్భమునఁ గవిభేదములఁ గూర్చియు బాత్రాచిత్యముగూర్చియుఁ జెప్పవలసి యున్నది. పూర్వవాగ్దత్తములైన వన్నియు నీసారి చెప్పినదాఁక మిమ్మువదలము-అని సభలో గేకలు.) నాయనలారా! కూతురు కొడుకును గందునన్నఁ దల్లి వల దనునా? వినువా రున్నప్పడు చెప్పకుందునా? పూర్వమున నుపేక్షించిన వానినే కాక నింక ననేకవిషయములఁగూర్చి చెప్పెదను. ప్రపంచచర్య లంతకంటె నంతకంటెఁ జెడుచునేయున్నప్పడుపన్యాస విషయములకు లోపమేమి? భగవత్కటాక్షము మాత్రముండవలయును.
నాయనలారా! కవిలక్షణము లింకఁ జెప్పెదను. ఇది చప్పన మనస్సునఁ బ్రవేశించువిషయము కాదు. కావున సావధానచిత్తముతో వినవలయును. వస్తువర్ణనశక్తి నింతవఱకుఁ జెప్పియుంటిని. పరుల సుఖదుఃఖాద్యవస్థాభేదములను తనవిగాఁ జేసికొని పరులహృదయ ములందు దూరి తన్నుఁ బూర్తిగ మఱచి తనవ్యక్తిత్వమును బూర్ణముగఁ దుడిచిపెట్టి వారిహృదయములం దైక్యమై, వా రట్టియవస్థాభేదములం దెట్లు మాటలాడుదురో, యెట్లు పాడుదురో, యెట్లు గంతులిడుదురో, యెట్లు కూలఁబడుదురో, యెట్లేడ్తురో యట్లు మాటలాడి, యట్లు పాడి, యట్లు గంతులిడి, యట్లు కూలబడి, యట్లేడ్చునాతఁడు కవి. కళత్రవిహీనుఁ డగునిర్భాగ్యు డేడ్చిన ట్లోకపుడు, పుత్రోదయమైన భాగ్యవంతుఁడగు వృద్దుఁడుప్పొంగి మహానందమున నోలలాడినట్లొకపుడు, సందిగ్దావస్థలో నెటు చేయుటకుఁ దోఁపని యాపన్నునివలె నూఁగులాడి యొకపుడు, నపకారి యగుసరి యెదుటఁబడిన