ఈ పుట ఆమోదించబడ్డది

చదువుటకర్హులగు నీ యిరువదుగురిలో వారెవ్వరో చెప్పనా? న్యాయవాదులు, సర్కారుద్యోగులు, వర్తకులు, పాఠశాలోపాధ్యాయులు, గ్రంథాగార సంపాదకులు, మార్గస్టులు, వేశ్యాప్రియులు మొదలగువారున్నారు. న్యాయవాదులు, సర్కారు ద్యోగులు, వర్తకులు, పాఠశాలోపాధ్యాయులు నాంధ్రభాష చదువరు. ఆంధ్రభాషలోఁ దఱచుగ మాటలాడరు. ఆంధ్రగ్రంథ ములు ముట్టరు. తత్రాపి యాధునికుల గ్రంథముల పేరే వినరు.

వీరివలన భాషకుఁగాని భాషాజ్ఞానసంపన్నులగు గ్రంథకర్తలకుఁ గాని యేవిధమైన లాభములేదు. ఇంక గ్రంథాగార సంపాదకులు బీరువాలలోఁబెట్టి బీగము పెట్టుటకు వారి గ్రంథములు సగము వెలకుఁ గొందురు. ఇంక నటకులు రూపాయకు మూడుపావులాలు తగ్గించుకొని యాగ్రంథములనుగొని వారికి నోటికందని జ్ఞప్తిలోనుండని పనికిమాలినవని తోఁచిన భాగములను ఖండించి నాటకములలో నుంచిన పాత్రములలోఁ గొన్నింటిని దీసి వైచి మఱికొన్ని సొంతపాత్రములఁ జేర్చి చావవలసినవారిని బ్రదికించి, బ్రదికియుండ వలసిన వారిని జంపి గదిలోని భార్యా పరీరంభ క్రియమొదలు కాటిలోని కడపటికర్మమువఱ కన్నిపనులుగూడ పార్శీమట్ట పాటలచేత జరిపించి గ్రంథమంతయు భంగమొనర్చి భ్రష్టమొు నర్చి పరశురామప్రీతి చేయుదురు. ఇంక మార్కిస్టులు రైలులోఁ బ్రయాణమొర్చువారు రెండణాల కొక్క నాటకమో యారుడబ్బుల కొక్కనవలయో కొని కునికిపాట్టు వచ్చునప్పడు రవంతచూచుచు జట్టుగాల్చి దానిపై బ్రమాదవశమున ధూకరించుచుఁ దప్పసరియైనప్పడు మాత్రము పాదరక్షలతోఁ ద్రౌక్కుచు నేసందడిలోనో కాఫీపాత్రయో నీటిచెంబో తిరుగబడుటచే నది తడిసిపోవంగ దాని నావలనో మూత్రపు గదిలోనో పాఱవేయుదురు. ఇంక వేశ్యాప్రియులు తమవేశ్యల యొద్ద దాము మిగుల రసజ్జల మనిపించుకొనుట కేదో నవలయో నాటకమో కొని వారియొద్ద వారి ప్రీతికొఱకై నాటకపద్దతిగాఁ జదివి మంచము క్రింద బాజవేయంగా దానిని వేశ్యమాత యడ్డుపొగకో, ప్రధాన నాయిక పాలా స్త్రిపట్టులకో వినియోగింతురు. గ్రంథము లెట్లు భ్రష్టమయినను గ్రంథకర్తలొక్క పూటయైన దినుటకు వీరివలననే సదుపాయమగు చున్నది. ముష్టికారువాఁడు గ్రంథము కావలసినదే కాని పావుల డబ్బులు పెట్టి భాగ్యవంతుఁ డొక్క పుస్తక మైనఁ గొనండే. నలువది రూపాయలు జీతము తెచ్చుకొనుజనుడు మొదలు నాల్గువేల రూపాయలు జీతము తెచ్చుకొను జిస్టిసు వఱకుఁ జదువుకొనుట కొక్క యాంధ్ర గ్రంథమైనఁ గొనినవాఁడు కనఁబడఁడే, సిగ్గుసిగ్గు. జాతికి సిగ్గు. దేశమునకు సిగ్గు. ఆంధ్రగ్రంథము కొనినయెడల నప్రయోజకత, అభాగ్యత. అప్రతిష్ట, అజ్ఞత, ఈభాగ్యవంతులలో నట్టియపోహ మంతరించినఁగాని యట్టి గర్వము కడతేరినఁగాని, యట్టియజ్ఞానము ధ్వంసమైనఁగాని భాష బాగుపడనేరదు. కడుపుకట్టుకొని కవులెన్నిగ్రంథ ములను వ్రాయఁగలరు? ఎంతకాలము వ్రాయఁగలరు. భాషా సేవకై వినియోగపడని వీరి భాగ్యమెందుకు? వీరు గ్రంథములు వ్రాయనక్కఆలేదు. చదువనక్కఱలేదు. వీరు మైన్సు పినాల్ కోడ్ (Maynes Penal Code) కంఠపాఠము తలక్రిందుగాఁ జేయవచ్చును. కళాపూర్ణోదయగాధనైన విననక్కఆలేదు. జస్టిసు బెన్సను (Benson) గారి తీర్పులన్నియు వీరి జిహ్వాగ్రమున నుండనేవచ్చును. జనకచక్రవర్తి యెవరో వీరికిఁ దెలియన్లక్కఆలేదు. వీరు భాగ్యవంతులయొద్ద బదుళ్లు తీసికొని దివాలాలు తీయనేవచ్చును. సుమతిశతక మైనఁ జదువనక్కజలేదు. ఆంధ్రదేశమునఁబుట్టి ఆంధ్రులై ఆంధ్రజాతిరక్తమును దేహమునఁగలిగి యున్న వీ రాంధ్రకవులగ్రంథముల నాంధ్రదేశముకొఱకైనను, నాంధ్రభాషకొఱకైనను,