ఈ పుట ఆమోదించబడ్డది

ధోరణితోఁ దాళపు జిప్పలు చేత బుచ్చుకొని తాండవించుచున్నాఁడు. అదిగో ఒక్క భాషాపండితుడు "ఇటుచూడుఁడు" అని తర్జనితోఁజూపించుచున్న పెద్ద యక్షరములేవో చదువఁగలరా? “విజ్ఞానసర్వస్వాది గ్రంథము లిక్కడ”నని వ్రాయ బడియున్నది. సెబాస్! ఇవి గీతపద్యనాటకము లని యెవ్వఁడో యొకడు కిత్తనారసంచిమూటను విప్పచున్నాఁడు. ఇవి స్వతంత్రముగ రచియించిన నవలలని గుమికూడి కొందరేవోపేళ్లను జదువుచున్నారు. సౌందర్యతిలక మని మరియేమో యని వినఁబడుచున్నది. ఇదిగో నూతనాంధ్ర వాజ్మయచ రిత్ర మని యొకపుస్తకమును బైకెత్తి యెవరో చూపుచున్నారు. ఆమూలను రాశిపోసిన వన్నియు గ్రామ్యభాషా గ్రంథములు. అచ్చట వృద్దుఁ డయ్యును బలిష్టుడైన యొక బ్రాహ్మణవర్యుడు గ్రామ్యభాషోత్కృష్ణత నుపన్యసించుచు దమ పుస్తకములలోఁ బ్ర మాదమునఁబడిన విమర్శాదర్శవిమర్శాదర్శమను గ్రంథమును బైకిఁదీసి గీత నాటకముల దొంతరపైకి థూయని విసరి వైచుచున్నాఁడు. అచ్చట జేరిన గ్రంథకర్త లయిదారువందలకుఁబైగ నున్నట్లు కనుపట్టుచున్నారు. వీ రందఱిచేతులలో నొక నాట కమో, నవలయో, ప్రహసనమో, చిన్నకథయేూ యున్నది కాని రిక్తహస్తుఁ డొకడును లేఁడు. ఇక్కడం జుట్టకాని సిగరెట్టుకాని కాల్చఁగూడదని పెద్దయక్షరములు గోడలపై వ్రాయబడి యున్న యాకొవో యెఱుఁగుదురా? అవియే తాళపత్రగ్రంథనిలయములు. ఆసమీపము ననే కొందరు చేతులలో నేమియోకాని గలగలలాడించుకొనుచుఁ దిరుగుచున్నారు కనుచు న్నారా? రాగికడియములలోఁ దగిల్చిన రాగిరేకులున్నవే యవియే పూర్వశాసనములు; వారే భావ్యాంధ్రసారస్వత చరిత్రకారులు. వహవ్వా ఎక్కడఁ జూచినఁ గవియే. ఎక్కడఁ జూచిన నాటకకర్తయే. ఎక్కడఁ జూచినఁ దూర్పువారి పొట్టియేచ, పడమటివారి బారెఁడేసి దీర్ఘ ములు, మధ్యమండలపువారి మట్టసపు మాటలు. ఒకరీతి యేమి యొక వైఖరి యేమి? అచ్చట నన్నియుఁ గలసియున్నవి. కవులు గవులను దిట్టుచున్నారు. కవులు విమర్శకులను దిట్టుచున్నారు. విమర్శకులు కవులను దిట్టుచున్నారు. విమర్శకులు విమర్శకులను దిట్టుచు న్నారు. కవులు విమర్శకులైన వారు విమర్శకులు గవులైనవారిని దిట్టుచున్నారు. వీరిపక్షపు వారు వారి పక్షపువారిని దిట్టుచున్నారు. వారిపక్షపువారు వీరిపక్షపువారిని దిట్టుచున్నారు. ఏపక్షమున లేనివారు రెండు పక్షములవారిని దిట్టుచున్నారు. మహాజనులారా! ఈ మహాకోలా హలములోఁ గొందరు మగువలుకూడ గనబడుచున్నారు చూచితిరా! అబలాసచ్చరిత్రర త్నమాల యని, పావిత్రీనాటకమని, మరియేమో యని సన్ననైన గొంతులతో సంగీతము వంటి ధ్వనులు విన బడుచున్నవి. తెల్లగ సుద్దకొండలవలెనగపడునవి యేవో తిలకించితిరా! ఆంధ్రపత్రికలు, కృష్ణాపత్రికలు, హితకారిణీపత్రికలు, న్యాయదీపికలు, గోదావరీపత్రికలు, జన్మభూమిపత్రికలు. ఇవికాక యెన్నియో గ్రంథరూపమున వెలువడిన సంచికలు. ఇక నావైపున నున్నవారెవరు? వారే నవ్యకవులు. తెనుఁగుతోటలో యుద్దగీతములు, మోహగీత ములు, భావగీతములు, ప్రేమపాటలు రుంయిమని రొదచేయుచున్నవి. వినుచున్నారా? ఈమహాసంకులములో రాట్నపుతములు, ప్రత్తిగీతములు, ఖద్దరు పాటలు, నూలోడుకుపా టలు, ఏకుచేయుపాటలు, స్వరాజ్యదర్పణములు, స్వరాజ్యతాంబూలములు! వాక్కునకు వ్రాఁతకు నింత విజృంభణము ముందెన్నఁడైన నుండెనా? ఓ! ఏమి సంక్షోభము! ఎంతశక్తి ఎంత జీవము! ఎంతధాటి శారదాదేవి కింత మహోత్కృష్టదినములే లేనట్లు కనఁబడుచు న్నదే! కాని మొదటి రెండుమూడు మెట్టమీఁది వారెవరో కేకలిడుచున్నారు వినుడు.