ఈ పుట ఆమోదించబడ్డది

నున్నది. మదరాసులో రాజప్రతినిధిగారు ప్రథమమంత్రి వీరగుటచే రాజప్రతినిధిగారే పరిషత్సభ నిట్టు బహూకరించి రని యెంచవలసి యున్నది. ఆహాహా! ఇది యెంత మహాసుది నము! సెప్టెంబరు రెండవతేది. పోనిండు. అని మన కెందుకు? దుందుభినామ సంవత్సర భాద్రపదశుద్పైకాదశి భాషాచరిత్రయందు బంగారు వర్ణములతో ముద్రింపవలసిన భద్రతిథి కాదా? ఆంధ్రశారదాజయంతి జరుపఁదగిన యమూల్య దిన మిదియేకదా! ఆంధ్రభాషకు జయమగుఁ గాక! ఆంధ్రభాషా పోషకులకు జయమగుఁ గాక? ఆంధ్రసాహిత్యపరిషత్తునకు జయమగుఁ గాక!

ప్రస్తుతాంధ్రభాషాస్థితి:- ఆంధ్రభాష ప్రస్తుత మెట్టి స్థితిలో నున్నదో రవంత చెప్పె దను. నేను జెప్పట యెందుకు? ఆంధ్రభాషాదేవి యెట్టున్నదో మీరే చూడుడు. అదెట్టు? సహజభావనా బలసంపన్నుల మైన మనము మనస్పూర్తిగా జూడదలఁచుకొన్నయెడల శార దాదేవి మనకుఁ బ్రత్యక్షము కాకపోవుటయే. మనశ్శక్తికి బద్దులుకాని దేవత లెవరు? నాయనలారా! బాహ్యనేత్రములను రవంత ముకుళింపఁ జేయుడు. ఆంతరనేత్రజ్యోతి నెగస బొడిచి దానికిరణము లటు లిటులు చెదరనీయక సంఘీభవింపఁజేసి మనకుఁగావలసిన విషయములపై సుస్థిరముగ సూటిగఁ గేంద్రీకృత మొనర్పుఁడు. ఆహవనౌకలందలి యన్వేష ణజ్యోతికంటె ననేకగుణతేజస్సమ్బద్దమగునట్టు, వెలుఁగఁజేయుడు? ఇంకనేమి? అదిగో అదిగో ఒడలు జలదరించునట్టు, కనులు కృతార్ధములగునట్టు, మనస్సు పుష్పించునట్టు, జన్మము తరించునట్టు-ఆంధ్రశారదాదేవి దర్శన మిచ్చుచున్నదే! అనేక సహస్రచంద్రమండల సన్నిభమైన యాస్యమండలము వీణాదండము వంక రవంత యొుఱగి యున్నది. అందుచేఁ గిరీటమునుండి వ్రేలాడుచున్న ముత్తెముల గుత్తి మేరువునొద్దనున్న వీణబిరడపై వ్రేలాడుచున్నది. బాగుగాఁ బరిశీలింపుఁడు. ఎడమ మోకాలిపై మడచినకుడిమోఁకాలివం పుప్రక్కను రవంత వెనుకగ దేవతాచందన నిర్మితమైన వీణకుండ ప్రకాశించుచున్నదే. దివ్యసర్వ సుధాసేచనమున వీణాదండము తీగచెట్టు చిగిర్చిన ట్గామె యెడమ చేయి వ్రేళ్లు తంత్రులపై నెట్టు కదలుచున్నవో. ఆహా! అదిగో గుడివైపున రాజరాజనరేంద్రుఁడు, నెడమవైపునఁ గృష్ణదేవరాయలు వింజామరములు చేతఁ బుచ్చుకొని యెట్టు వీచోపు లిడుచున్నారో అదిగో ఆపీఠము మొదట బీతాంబరపు నడకట్టుతో నిలువఁబడి దేవికిఁ బారిజాతపష్పములతోఁ బూజ లొనర్చుచున్న యాపౌరోహిత్య బ్రాహ్మణుఁడెవరో యెఱుఁగుదురా? అదిగో ఒక్కచింతాకంతవాసి-క్రిందుగ నిలువఁబడిన యాకుండలాల సోమయాజి కప్పరపుటారతిపబ్లైరము చేతఁ బుచ్చుకొని-వహవ్వా నీరజాసన నీరజపత్రాక్షికీ నివ్వాళు లిచ్చు చున్నాడే మరియొక బెత్తెఁడు క్రింద-పురోహితుని యంత పొట్టియు గాక, సోమయాజియంత సోగయు గాక మట్టసపు మాదిరిగనున్న మంత్రి శిఖామణి మహాలక్ష్మీదేవి కోడలిని మందాకినీసలిలపుగిండి దోసిట బట్టుకొని సేవించుచున్నాఁడే ఆర్యులారా! చూచుచున్నారా?

ఉ. క్షోణితలంబు నెన్నుదురుసోఁకగ మొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నకదామశుక వారిజపుస్తకరమ్య పాణికిన్,