ఈ పుట ఆమోదించబడ్డది

34. సు.స.గారికి బహిరంగ లేఖ

సు.స.గారు పానుగంటి వారిపై మండిపడి మందలిస్తూ వ్రాసిన HEREDITY వాద విశేష వివరాలను ఆయన ఖండిస్తూ తాను చెప్పిన విషయానికి మరికొంత వివరంగా, తన విశ్వాసభూమిక, విశదం చేస్తున్నారు.

జంఘాలశాస్త్రి జవాబు చెప్పాలని సు.స. గారు ఆశించినా, ఆ పని జరిగేలోగా తన శక్తిమేరకు సమాధానం చెప్పక తప్పదన్నారు. ఏది ఎలా వున్నా HEREDITY వల్ల బిడ్డలో స్థూలదేహ లక్షణాలు అన్నీ కలగవచ్చునంటేనూ, కొన్నైనా కలుగుతున్నాయంటేనూ తనూ ఒప్పకొంటానన్నారు గాని–శరీర పరిణామంలో HEREDITY పనిచేయడానికి శక్తి కలిగిందే నని ఒప్పకొంటానన్నారు గాని మనస్సు మీద దానికి పిసరంత కూడా అధికారం లేదని తన అభిప్రాయమన్నారు.

మనస్సుకి మెదడు ముఖ్యావయవం గనుక మనస్సులో పరిణామం HEREDITY వల్ల కలిగినట్టు కనిపిస్తుంది గాని అది భ్రమ అన్నారు. ఉన్మాదాలన్నీ దేహపరిణామాలే కాని, మనః పరిణామాలు కావన్నారు.

పాశ్చాత్య శాస్త్రజ్ఞలలో ప్రకృతి శాస్త్రజ్ఞానం సంపూర్ణంగా వుండే మహావిద్వాంసుల్లో నూటికి 95 మంది నిరీశ్వరవాదులు. మిగిలిన వారు అజ్ఞేయ (AGNOSTICS) వాదులు.

మన హిందూ సిద్దాంత ప్రకారం శరీరాలు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరం మంటలోనో, మట్టిలోనో కలిసిపోతుంది. లోపల జీవాత్మగల సూక్ష్మ శరీరానికే మనవారు పునర్జన్మను నిర్మించారు. ఈ సూక్ష్మశరీరంలోనే, మనిషి సంతరించుకున్న అనేక పూర్వజన్మల కర్మఫలం వుంది. కనక ఒక బిడ్డలో వ్యక్తమయ్యే గుణాగుణాలన్నీ అతగాడి సొంత సొమ్ము. అంటే, ‘మనస్సు’ అనేది బిడ్డ సొంతమే. ఆత్మ, పునర్జన్మ, విశ్వాసాలుంటే తప్ప ఈ లెక్క మతం మీద విశ్వాసం వల్లనే మనిషి మనిషి అనిపించుకొంటున్నాడు.

మ్మా!

కార్తీకమాస భారతిలో మీరు ప్రచురించిన బహిరంగలేఖను జదివితిని. జంఘాలశాస్త్రి యుపన్యాసములువిని చాలఁ గాలమైనదనియు, నాతండు శీఘ్రముగ వచ్చి నూతనసంఘము