ఈ పుట ఆమోదించబడ్డది

వలన సులభముగఁ దెలిసికొనవచ్చును. జనులు నిదురించునపుడు కుడి ప్రక్కనో యెడమప్ర క్కనో పండుకొను నలవాటు కలవారై యుందురు కాని రెండు ప్రక్కలను సమాన సౌలభ్యముతోఁ బండుకొననేరరు. ఒకవేళ నిద్రలో నలవాటు లేని ప్రక్క కొత్తిగిల్లుట తటస్టించినను రెండుమూడు నిముసములలోనే మేల్కొంచి యలవాటైన ప్రక్కకు దిరుగుదురు. మనము పరీక్షింపదలచిన పిల్లతండ్రికో, తల్లికో యెడమవైపునఁ బండుకొనునలవా టున్నదనుకొనుము. ఈపిల్లగూడ నెడమప్రక్కనే పండుకొనును. తెలియక తల్లి యాపిల్లను గుడిప్రక్కను బండుకొనఁ బెట్టిన యెడల బిల్ల యిల్లెగిరిపోవ నేడ్చును. ఎడమప్రక్కగాఁ బండుకొనఁ బెట్టిన వెంటనే కిక్కురుమనకుండ నిద్రించును. బాల్యమునఁ దల్లికో తండ్రికో యెడమ చేతివ్రేల్లో కుడిచేతివ్రేల్లో నోటఁ బెట్టుకొను నలవాటున్న యెడలఁ బిల్ల యాచేతివ్రేళ్లే యావయస్సులోనే నోటఁబెట్టుకొనును. పిల్లతల్లికిఁ దండ్రికిఁగూడ నత్యంత మధుర పదార్ధ మిష్ట మనుకొనుము. ఈపిల్లకేమో కాని తీపి యిష్టము లేదుసరేక దాపులు పనగ మహాప్రీతి! ఈవ్యత్యాసమునకుఁ గారణమేమో యని దూరాలోచన చేయకుండం బూర్వజన్మమే కారణమని తొందరపడి సిద్దాంత మొనర్పకుము. అంత దూరాలోచన కూడ నేల? వంశవృక్షమున నీపిల్ల తండ్రి ప్రక్కనేయున్న యామె యొవతెయో యెఱుఁగుదువా? ఆమెయే యిపిల్ల పెద్దమేనత్త. ఈమె దినమున కొకపదలము చింతపండుపులుసు ద్రాగునప్పడు మేనగోడలికిఁ బులు సిష్టమనగ నాశ్చర్యమేమి? తల్లికాని, మేనత్తకాని యెన్నవయేఁట నెన్నవ మాసమునఁ బ్రథమరజస్వలయగునో యన్నవయేటనే మాసమైన బీరుపోకుండ బిల్ల రజస్వలయగును. కాని తల్లి మేనత్తల సాంప్రదాయము ననుసరించి యీపిల్ల పండ్రెండవయేట రజస్వల కాక, పదియవ యేటనే రజస్వల యయ్యెనేమి చెప్పమా? ఈమాత్రమునకై తొందరపడి వెనుక జన్మమువఱకుఁ బోక, ముందువసారాలోఁ గూర్చొండి చిమ్మిలి దంపించుచున్న పిల్లపితామహియొద్ద కేగి యడుగుము. ఈవిషయమున నామనుమ రాలికి నాపోలికవచ్చినదయ్యా యని యామె పైకి విసుఁగుజెందిన ట్లగపడుచున్నను లోన మరియచుఁ దనచరిత్రము లోని విచిత్రాంశమును బహిరంగపఱచును. ప్రథమ రజస్వలా దినములలో నీపిల్ల కావునేయి, పులగము, ప్రాంతబెల్లముఁ దక్క మఱియేదియు నీయకుండ నెంతకఠిక పథ్యమునుఁ జేయించినను దల్లికిఁ గాని, మేనయత్తకుఁ గాని ఋతుశూల యున్నయెడల నీపిల్లకుఁగూడ నేకాలదిగనో యది సంక్రమించును గాని విడువదు. ఇంక గర్భవతిగా నుండునప్పడు ప్రక్క శూలంగాని, పక్కనొప్పిగాని వంశములోని పూర్వ స్త్రీల యాచారము ననుసరించి కలుగును. సంతానక్రమము కూడ సంసార సంప్రదాయము ననుస రించియే యుండును. రజోదోష నివృత్తికూడఁ దల్లినిబట్టియో, తల్లితల్లినిబట్టియో, తండ్రి సోదరినిబట్టియో, యామెతల్లిని బట్టియో యుండును. వేయేల? తల్లిదండ్రుల సామాన్యము లైన యభ్యాసములు కూడ బిల్లలకు సంక్రమించునుగాని వదలవు. మాటలాడు చున్నప్పడు ఆండ్రి చేతు లెట్లాడించునో, తల యెట్టు విసరునో బిడ్డ కూడ నటులే చేయును. తల్లికాని తండ్రికాని గొంతుకూరుచుండి భుజించుటయే యలవాటు కలిగియుండునెడలఁ బిల్లగూడ నటులే కూరుచుండి భుజించును. బలాత్కారమునఁ బద్మాసనమునఁ గూరుచుండం బెట్టి యాపిల్లను భుజింపఁ జేయునెడల నోటనిడుకొన్న కబళము దిగక పోవుటచేఁ గెక్కు కెక్కు మనును. సాధారణముగా జనులు నాలుగైదు నిముసములకంటె నెక్కువకాలము నిలువఁ బడవలసివచ్చునప్పడు రెండు కాళులపై సరిగ నిలువఁబడరు. కుడికాలి పైనో యెడమకాలి