యందురు. అట్టివారెందరో యిదివఱకు జన్మించిరి. కాని వారి తల్లిదండ్రులు సామాన్యాకృతి కలవారేకాని తద్భిన్నులు కారని పరిశోధనమువలనఁ దెలిసియనంశమే కదా! ఏడడుగుల యెత్తుగల తండ్రికి మూడడుగుల వామను డుద్బవించుట లేదా? ఇంతయేల? ముగ్గుఱు భార్యలు చాలక దినమున కొకతె చొప్పన మూఁడువందల యఱువదుగురుంపుడు కత్తెలను జేరఁదీసిన దశరథ మహారాజునకు-పరశురాముడు కాబోలు యుద్ద వార్తనంపఁగాఁ జేతులకు గాజులు తొడిగించుకొని యూడువారి గుడారము లలో దూఱిన దశరథమహారాజుకేకదా -ఏకపత్నీవ్రతుండైన జానకీనాథుడు-జగదేకవీరుఁడైన శ్రీరామచంద్రమూర్తి జన్మిం చినాఁడు; అమ్మా! ఇంకను Heredity ని నమ్మెదవా? Heredity యనుదాని వలన దండ్రిసంబంధమైన ముక్కుపొడుగో, తల్లి సంబంధమైన కన్నుసోగయో, మేనమామసంబంధ మగు మూతివంకరయో పిల్లవానియందు గాదా చిత్కముగ సంక్రమింపవచ్చును గాని, జగత్తు నేలుటకు సామర్ధ్యము గలయట్టియుఁ గాక జగత్తునకు బానిస యగునంతటి తుచ్చత్వము గలయట్టియు, మనస్సులోని శౌర్యము, గాంభీర్యము, త్యాగము, నాపత్సహనము, భూత దయ, దైవభక్తి మొదలగు సద్గుణపరంపర కాని, కాతరత, లాఘవము, లోభము, శాంతిరాహి త్యము, తామసను, నాస్తికత మొదలగు దుర్గుణ పరంపర కాని, Heredity వలనఁ గలుగుట కవకాశము లేదు. అయవకాశమే యుండు నెడలఁ బ్రహ్లాదు డంతటి వాఁడు హిరణ్యకశిపు నంతటివానికిఁ బుట్టుట సంభవించునా? అనూచానత కారణము కానియెడలఁ గారణ మేదని యడుగుదు వేమో? జీవుని పూర్వజన్మ సుకృత దుష్కృతములే జన్మములోని గుణాగుణ ములకు కారణములు కాని వేఱుకాదు. అమ్మా! నమ్ముటకు నీ కిష్టమైన యెడల నమ్ముము; కాని యెడల మానివేయుము. నీనమ్మకము వలన నార్యమతమునకు బలము లేదు. నీతిరస్కా రమువలన నీరసతయు లేదు. మహాబుద్ దిశాలులైన పెద్దలు నిర్వచించిన మాటలను నాకు దెలిసినంవఱకు నా యత్యల్పశక్తి ననుసరించి చెప్పచున్నాను. వేదరుల యందలి విశ్వాసము చేనైనను నీనూతన సిద్ధాంతమును ద్యజింపఁ దగును.
"నీవు స్త్రీపాత్రధారణ మొనర్చితివి కావున నీతో నేను గాఁపుర మొనర్స"నని నీవు భర్తతో నిరంకుశముగఁ బలికితివే! ఆహా! భారత దేశ సంరక్షక దేవతలు గడగడ వడకునం తటి మాటయంటివే భర్తపైట వేసికొని వంకరగఁ జూచి నంతమాత్రముననే భర్తృభార్యా సంబంధము తెగునని యనుకొంటివా? అదిగాక 'మనకు భర్తలు శాశ్వతులు కారు; వారి యిష్టము లేకున్నఁ బోవుదురు. మన యిష్టము లేకున్నను బోవుదు' రని వ్యాసుఁడు బ్రహ్మసూత్రరచన మొనర్చినట్టు నీవు పరిణయ సూత్రములను గల్పించితివే! అమ్మా, యెంతదానవు! మనవివాహ శాసనము వంటపూటింటి వ్యాపారమువంటిదే యనుకొనుచు న్నావా? రషియావారి మూఁడు సంవత్సరముల “కాంట్రాక్టు' వంటిదే యనుకొనుచు న్నావా? భార్యాభర్తలు తనువులు వాసినను బంధము నీడునది కాదని యెఱుగవా? శరీరయాత్ర చాలించి స్వర్గమున నఖండానందసముద్రమున నోలలాడుచుండు నిల్లాలైనను భూలోకమం దింక జీవించియున్న తనభర్తకై గ్రుడ్లనీరుగ్రుక్కు కొనుచునే యుండును గదా? తనభర్త యన్యకాంతాసక్తుఁడు కాక తనయందే యపేక్షగలవాడై యుండవలయు ననియుదన గృహదేవతలను బూజించుచు, నతిథినత్కార మొనర్చుచు, సదాధర్మమందే చరించుచుఁ గీర్తికాముఁడై యుండ వలయుననియు, బుణ్యరాశియైన యాతండు, భూలోక యాత్రా పరిసమాప్తి యైనపిమ్మట స్వర్గమునఁ దన్నుఁజేర యవ్యయానందము ననుభవింపవ