మఱి యొకటియా యను పరీక్షకాని, యపస్వరమునకుఁ గైశికియా కాకలియా యను విచికిత్స యుండునా? ఉపేక్షకంటె నుత్తమ విమర్శనము వేఱొకటి లేదు కావుఁ దిట్లటసంగతి యింకఁ దలపెట్టక విమర్శింప వలసిన యంశము లేవో కొలదిగా విమర్శింతును.
అమ్మా! స్త్రీపాత్ర ధారణము తఱచుగజేయు మగవానిమూలమునఁ గలుగుపిల్లలు సంకరస్వరూపులై యుందురని మీవాదము. ఇది మీభావన కాని ప్రకృతి సత్యము కాదు. ఆడారివారెందఱో ప్రపంచమున నున్నారు. నే ననేకుల నెఱుఁగుదును. వారి యాండారితన మింత యంతయని చెప్పవీలులేదు. మూటలో, జూపులో, రూపులో, నడకలో దలంపులో, జర్యలో సంపూర్తిగా నాడువారి వంటివారేకారు –ఆఁడు వారే? అంతయో యింతయో దుష్టత్వ మాడంగితనమున కంటియే యుండును. ఆఁడారివాఁడు గుమ్మము నొద్ద నిలువ బడియుండగ వీథిలో నెవఁడైన సుందరుడు పోవుచుఁ దనవంక జూడకుండిన యెడలఁ గనపుట్టి యేమి మునిఁగిపోయినది? తన స్త్రీత్వము నాతండవమాన పఱచినాఁడని యాతం డ ట్టుడికిన ట్లుడికిపోయెను! ఆసుందరుఁడు మఱియొక యాండు దానినిఁ జూచి మందహాస మొనర్చునెడల నాడారివాఁడసూయచేఁ దలనేలఁగొట్టు కొనుటకు సిద్దపడును. అట్టి యాడంగివాండైనను బుంస్త్వసహితుడై పతివ్రతయైన తన భార్యయం దిల్లునిండిన బిడ్డల గనుచున్నాఁడు. వారు సంకరస్వరూపులై యున్నారా? అణువంతయాడారి తన మాతని పుత్రులయం దెచ్చటనైనఁ గనబడుచున్నదా? దుర్బలులైనపిల్లల గనుచున్నాఁడా? ఉక్కుతునుకల వంటి వారిని గనుచున్నాఁడు. పౌరుషవిహీనులై వారిని గనుచున్నాఁడా? లేదు, శౌర్యసహితులనే కనుచున్నాడు. ఆడారితండ్రికిఁ బుట్టినవాఁ డెవ్వడుకూడ నాడారి వాఁడు కాలేదని యనేక దృష్టాంతములు చూపవచ్చును. అంతవఱ కిప్పడ వసరము లేదు. స్త్రీపాత్రధారి యైన పురుషుడు దేహ మనస్తత్త్వములం దాడంగివాని కంటె నెక్కువ చెడిపోయినాడా? లేదు ఆడంగివాఁడే యట్టిబిడ్డలను గనుచుండ, స్త్రీపాత్రధారి సంకర స్వరూపులను గనుననుట సత్యదూరము; సాహసము.
వేదవి హితాచారసంపన్నుఁడై స్వచ్చమూర్తియైన వైదికశిఖామణికి, రైల్వేవారి భోజన మఠములందు గొడ్డుమాంసమును బీకుకొని తిను కర్మచండాలుడు జన్మించుచున్నాఁడు. పార్వతీపరమేశ్వరులవలె నపత్రిమాన దాంపత్యసహితులై పరమప్రశస్తులైన భార్యాభర్తలకు వారవనితామాతచేఁ జెప్పదెబ్బలు దిను వంశోద్ధారకుఁ డుదయించు చున్నాఁడు. షట్చా (స్త్రపాండితీ మండితుండై సర్వదిగంత విశ్రాంతకీర్తి యుక్తుఁడైనవానికి శుంఠలలో శుంఠ జన్మించుచున్నాఁడు. అమ్మా! ప్రపంచ చరిత్రమును జూచుచుండుట లేదా? వితరణకళాదీక్ష యందు బలిశిబికర్ణాదులంతటి మహావదాన్యులగర్భమునఁ దండ్రిప్రాణోత్ర్కమణసమయ మున నాతని తలవైపునఁ బెట్టుదీపము దండుగ యని యార్పఁ జేయు లుబ్ధాధమాధముఁడు కలుగుచున్నాఁడు. నవరసమయ నవజగన్నిర్మాత యైన Shakespeare మహాకవి గొడ్డు కోసికొను కటికవానిపుత్రుఁ డని యందురు. ఒక నీగ్రోజాతి యాతండు మహావిద్వాంసుడై మహాసభయం దొకమహోపన్యాస మిచ్చుచుండగా విని మహాశ్చర్యభరితుఁడై నట్టు శ్రీవివేకానందస్వామి సెలవిచ్చినారు. ఆ నీగ్రోపండితుని తండ్రితాతలు వట్టి మూఢులైయుండ, నట్టి విద్వాంసుఁడు వారివంశమునఁ బుట్టుట చూడగా Hrediry యనుననది కల్లకాని వేఱుకాదని యాస్వామి స్పష్ట పఱచినారు. ఏడడుగులయెత్తు దాఁటినవానిని Giant అని