ఈ పుట ఆమోదించబడ్డది

మగవాఁ డనువాఁ డాడుదానిని వీధిగుమ్మమువద్దకుఁ గొలది కాలము క్రిందటివ ఱకు రానిచ్చినాడా? చీపురుకట్ట వదలి Briefbag ను బట్టనిచ్చినాడా? తన సేవ మఱచి దేశసేవమాట నెన్నఁడైనఁ దలంప నిచ్చినాడా? ఎంతసేపు తాను, తనవిద్య, తనసుఖము, తనకీర్తి, తన వృద్దియే కాని సృష్టిలోఁ దనసాటిదైన యాడు దున్నదనియైన మనసునఁ బెట్టినాడా? ఇతర దేశ స్త్రీల యభివృద్ది వినియైనను రవంత దయ, కాసంత దాక్షిణ్యము, నిసుమంత సమభావము మనయోడల గనబఱచి నాడా? తరతరములనుండి యుగయుగ ములనుండి కార్కొని ఘనీభవించిన యజ్ఞానాంధకారమునుండి స్వప్రయత్నముచేత నతిశీఘ్ర కాలములో జ్ఞానతేజః ప్రపంచమున కుబ్బెత్తుగ నుబికిన జాతి సర్వప్రపంచ చరిత్రమం దొక్క యార్యనారీజాతి తక్క మఱియొకటియున్నదా? బ్రాహ్మణులేమో తమ్మజ్ఞానమునఁ బడద్రోచిరని యబ్రాహ్మణులు వారి కెదురు తిరిగిరి. కాని నారీసంఘ మంతయు నీ యనారీసంఘము నేల యెదుర్కొని తొక్కివేయగూడదో నాకు బోధ పడుటలేదు. మగవాడంత స్వార్డలోలుడు, నసూయాపరుడు, నధర్మశీలుఁడు నహంకారదూషితుఁడు ప్రపంచమున లేఁడని మనచరిత్రవలన స్పష్టపడినదా? పాపము పండిపండి బ్రద్దలు కాకమా నునా? చౌటిసడియలని తా ననుకొనినవే కాదా అప్పడు సుక్షేత్రఖండిక లైనవి? రాక్షసిబొగ్గుదిబ్బలని తా ననుకొనిననే కాదా యిప్పడు రత్నాలగను లైనవి! ఎండి, మెలికలు పడి, పిట్టతలలు వైచి కంపతొడుగైన తీఁగలే కాదా యిప్పడు ప్రసవఫలబంధుర పరిమళప్రాంచిత ములైనవి! వంటయింటి పడుకటింటి బానిసలే కదా యిప్పడు భారతదేశ సౌభాగ్య దేవతలై ప్రకాశించుచున్నారు! చిరకాలనాగరికత, చిరకాలవిద్య, చిరకాలాభ్యాసము, చిరకాలాహంభా వము కలిగిన మనవాఁ డిప్పడు మనకు వెనుకఁబడినాఁడా లేదా? భారతదేశ సమస్తకార్యభార వహనక్రియాకలనయందు ముందుబుజము మనదా యాతనిదా? మనము పాడినపాటను బట్టి తనయుడు గిప్పడు సర్దుకొనుచున్నాఁడు. మార్గదర్శకవ్యాపారమున మగువ నిల్చి మగవానిని వెంటఁద్రిప్పకొనుచున్నప్పడేకదా నాగరకత శిరోనక్షత్రమంటిన ఫెంచవలసి యున్నది!

ఇట్టిస్థితిలో మన ముండుటచేత భగవంతు నెంతయైనఁ బ్రార్డింపవలసియున్నది. మనము మనల నెంతయైన నభినందించు కొనవలసియున్నది. మగవాని నెంతయైన నిందింపవ లసియున్నది. కాని యింతసంతోషమందుఁ గూడ నొకటి రెండు విచారహేతువులున్నవి కాని లేకపోలేదు. ఒక దానిని గూర్చియే యిప్పడు చెప్పెదను. నేను జెప్పఁబోవు నంశము మీ రెఱుఁగనిది కాదు. మీరేల యింతకాల ముపేక్షచేసి యూరకుంటిరోయని నాకాశ్చర్య ముగా నున్నది. ఈయంశము కూడ మగవాని దుష్టవ్యాపారముతో సంబంధించినదే. ఈదోష మేదో వెల్లడించి దీనిని దిద్దుబాటు చేయుటకుఁ బ్రథమావకాశము భగవంతుడు నాకు గటాక్షించి నాఁడు కదా యని నేను సహేతుకమైన గర్వమొందుటలోఁ దప్పలేదని యనుకొందును.

సోదరీమణులారా! మనము కంటికి జోడుపెట్టుకున్నప్పడు కొలఁది కాలము క్రిందట. దానెంత వెక్కిరించినాడో మీకు జ్ఞప్తి లేదా? అక్షిరోగమునకేకాక యాస్యసౌభాగ్య మునకుఁగూడ నద్దములను దాను ధరించునప్పడు వానిని మన మేల ధరింపఁగూడదో? అది తన యనుకరణమట. మనము కంటితోఁ జూచుటకూడ దన యనుకరణమే