ఈ పుట ఆమోదించబడ్డది

తను, రోదనము చేయుచున్న భార్యను గాంచి, కన్నులనుండి జాఱిన యిందుపగింజలం తటి రెండు బాష్పముల ను త్రోచివైచి-'ఓయబ్బ! ప్రపంచ మిట్టిదని యొవ రెఱుఁగరు? తొందరపడకు. ఒంటిమెట్టు కోదండరాము డిచ్చినాడు. ఆయనయే తీసికొన్నాడు. ఓయబ్బ తనసొమ్ము తాను తీసికొనఁడేమి? పోతరాజుగారి మాటయందు నాకున్నట్టే నీకు బ్రమాణబుద్ది యున్నది కావునఁ జెప్పెదను.

"మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము! దేహి పుట్టుచుం
జచ్చుచునుండఁ జూచెదరు చావకమానెడువారిభంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక దాఁగవచ్చునే?
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికిన్."

అందువలన నిప్పడు మనయమ్మ వైకుంఠముననున్నది. నే నెఱుఁగుదును. నాకు రాత్రియే తెలిసినది" అనెను. ఇంతలో స్పోటకపుశవము నచటికిఁ దీసికొని రాగూడదు పోపో యని భటు లామెను బెదరించిరి. ఆమె యేడ్చుచు "నాయనలారా! పోవుదును. క్షమింపు'డని భర్తవంక తిరిగి “ఎవ్వరికైన నొకటంక మిచ్చినఁగాని యీపిల్లకుఁ దరువాతి కర్మము జరుగదు. నావద్దనేమియు లేదు. నేనే తీసికొనిపోయి నా చేతులతోనే యీపని చేయవలయునా? యని గోలున నేడ్చుచు దటాలునఁ బోయెను. ఆమె యేడ్చువాని భర్తగుండెలేకావు బ్రహ్మాండగోళమంతయు గడగడవడకిన ట్లయ్యెను. నిజమైన యాపద వచ్చినప్పడు- అందులో మహాపతివ్రత కాపదలవచ్చినప్పడు-ఆ యాపద కన్నకడుపుతో జేరినప్పడు-పునాదులతోఁ బెల్లగిల్లునట్టు-ప్రకృతి కంపించుననగా నాశ్చర్యమేమి? అంత సుబ్బరాజుగారు

“లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్లప్పెను మూర్చవచ్చె తనువ్ డస్సెన్ శ్రమంబయ్యెడి
నీవేతప్ప నితః పరం బెఱుఁగ మన్నింపందగుం దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!"

యను పద్యమును జదువుకొని కొంత శాంతిపడి రామనామస్మరణ మొనర్చుకొను చుండెను.

IV

సుబ్బరాజుగారి గంటపు దెబ్బతిని భటు డిఱువదిదినములు బాధపడి మరణించెను. ఖూనీ నేరము చేసినందులకు సుబ్బరాజుగారిని నబాబుగా రింక శిక్షింపవలసియున్నది. విచారణ కొక్కదినమున నాయనను నబాబుగారి కచ్చేరికిఁదీసికొనిపోవుట కేర్పాటయినది. వకీళ్లు కావలయునా? దస్తావేజులు కావలయునా? సాక్యము కావలయునా? నబాబుగాని యెదుటనే కాదా నేరము జరిగినది? భీష్మైకాదశీదినమున విచారణ జరుగనైయున్నది. ఆ యుదయముననే దేఁకుకొనుచు నాతని భార్య కారాగృహము నొద్దకు వచ్చి భర్తను గాంచి 'నాకీయుదయమున నుండి వాంతులు భేదులగుచున్నవి. నా తమ వీసాయంకాలమువలకు నిల్చునని తోపదు. నడువలేక యిట్టు దేఁకుకొనుచు వచ్చితిని. సర్వధాయనుగ్రహ ముంపవలయును." అనిలో యేటబడిన గొంతుతోఁ బలికెను. భార్యనుగాంచి భర్త