అంతలోనే తపాజవాసు సాక్షిపేర వచ్చిన యొక యుత్తరమును నాకిచ్చెను. నేను జూచుకొని నా మిత్రులకు వినిపించితిని. అదియిట్టుండెను.
సాక్షికి:- అనామకుఁ డనేక నమస్కారములు.
మాజిల్లాలో హరిజనులకు సేవఁజేసిన మహానుభావు డొకడుండెడువాఁడు. ఆతఁడు చేసిన సేవయంతయుఁ బ్రచ్చన్నముగ జరిగియుండుటచేత నాతనికి విశేషఖ్యాతి రాలేదు. కాని యాపుణ్యాత్మునిఁ గూర్చి యీ మండలములో మట్టున కెన్నియో చిత్రములై కధ లిప్పటికిఁ జెప్పకొనుచున్నారు. ఇట్టు ప్రతి మండలమునకు నొక్కరిద్దలు హరిజన సేవకు లుండిరి. హరిజన సేవా పవిత్రములైన యీదినములలోనే వారి ప్రచ్చన్న చరిత్రమును పైకిఁదీసి యవి ప్రజల కుపయోగించునట్టు చేయకపోయిన యెడల దోషము కాదా! కృతఘ్నత కాదా? ఆంధ్రులలోఁ బ్రముఖ లేమిచేయవలెననంగా మండలమున కిద్దలు బుద్దిమంతులను నియమించి పూర్వమున నచ్చటచ్చట హరిజనసేవకు లెవ్వరో వయస్సు మీరిన స్త్రీపురుషు లను గనుఁగొని వారిచరిత్రము లన్నియుఁ బ్రోగు చేయింపవలసియున్నది. అవి పరిశీలించి ప్రకటింపవలసియున్నది. వారిలో నెందలతో పవిత్రులు నవతారపురుషు లున్నారు. నేను మాజిల్లాలో బాహాటముగ నందeు చెప్పకొనుచున్న కథ నొక్కదానిని మీకుఁ బంపించితిని. దీనిని మీరు సాక్షిలోఁ బ్రకటింపవలయును.
అనఁగ ననఁగ బ్రాహ్మణుఁడు. ఆతఁడు వేదాధ్యయనసంపన్నుఁడు, పవిత్రచ రిత్రుఁడు. అతని భార్య యత్యుత్తమురాలు. భర్తను పరమదైవముగ గొల్చుచుండెను. వారికిఁ బిల్లలు లేరు. ఉన్న భూవసతి వలని రాఁబడిచేత వారు సర్వజాతుల కన్నప్రదానమొన ర్చుచు భుక్తశ్లేషమును దాముదినుచు సుఖముగ నుండిరి. కాని నిరతాన్నప్రదానము చేత ఋణమెక్కువైనది. దానినిఁ దీర్చుటకై భూముల నమ్మివేసినాఁడు. ఇల్లుమాత్రము మిగిలి నది. ఇంకను విరివిగ నన్నప్రదానముజేయుచున్నాఁడు. ఋణము నెమ్మదిగా దిరుగఁ బెరుగుచున్నది. ఈతని యన్నప్రదానమున కా వేళ యీ వేళయు లేదు. ఆజాతివాఁ డీజాతివాఁ డనుభేద మంతకంటె లేదు. ఎప్ప డెనండు వచ్చి యన్నమడిగిన సరే వానికిఁ బెట్టవలసినదే.
ఇట్లుండ, నొక్కనాఁటిరాత్రి నిదురించుట కింకఁ బ్రయత్నపడుచుంగఁగా నేఁటియా వలినుండి 'చైనులుగారూ! అన్నము! అన్నము" అని కేక వినఁబడెను. ఆకేకతో నదిరిపడి "ఆ" యని యొక్క కేక వైచెను. ఇంతలో "నేను చండాలుడ నని ఈచుట్టుపట్టుల గ్రామములవారు నాకన్నము పెట్టలేదు. మీరు పెట్టుదురని తెలిసి మీయొద్దకు రా బోమఁగ నేరడ్డము వచ్చినది" అని మఱింత గట్టికేక వినబడెను. వచ్చుచున్నానని బ్రాహ్మణుడు గొంతెత్తి యఱచెను. రాత్రిభాగము కావున నడుమ నీరున్న కారణమున నేరు విశాలమైనద య్యను గేకలు సులభముగా వినవచ్చుచుండెను. ఏటికిఁ బూర్తిగా వఱద తగిలినది. నడుము బిడ్డెక్కి నురగలతోఁ బ్రవహించుచున్నది. భయంకరముగ నున్నది. అది చీకటిరాత్రి. అంతలో బ్రాహ్మణుఁ డేటియొద్దకు వచ్చినాడు. మోకాలు దిగని యంగ వస్త్రము కట్టినాఁడు. దానిపై మఱియొక్క యంగవస్త్రము నడుమునకు బిగించినాఁడు. పెరుగునన్నము కలిపియుంచినకుండ నెత్తిపైనున్న చుట్టు కుదిటిపై బెట్టినాడు. కుండపైనున్న మూఁకుటిలో నావకాయ మొదలగువానిని బెట్టినాఁడు. దానిపై రెండడ్డాకు విస్తళ్లు