29. సభావ్యాపారములు
ఈరోజు ఉపన్యాసమేమీ లేదు. కాలాచార్యులు, వాణీదాసు, జంఘాలశాస్త్రి పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నారు.
సాహిత్య ప్రయత్నం, కృషి అనేవి ముందరి నుంచీ దరిద్రమైనవే. కాఫీ హోటలు, సినిమాలు ఈ రెండే డబ్బు సంపాదించే వ్యాపారాలుగా కనిపిస్తున్నాయని జంఘాలశాస్త్రి అని-కాలాచార్యుల అభిప్రాయం అడిగాడు. దానికి అతడు తర్కధోరణిలో, చావుబతుకుల గురించి చెప్ప విచారించవలసిన అవసరం లేదన్నాడు. వాణీదాసు, కాలాచార్యులు తర్క ధోరణిని ఖండించి, రవంతసేపు పొడుము దొరక్కపోతే నీ బాధ ఆదేవుడికి తెలుస్తుంది అన్నాడు. దాంతో కాలాచార్యులు, తాను పొడుము మానేశానని చెప్పాడు. వీరు ఇలా మాట్లాడుకుంటుండగా, పోస్టులో సాక్షి పేర ఒక ఉత్తరం వచ్చింది. వ్రాసినవాడు 'అనామకుడు'. అందులో విషయం ఏమంటే, హరిజన సేవ చేసిన మహానుభావులు వార్తలలోకి ఎక్కినవారు ఎక్కగా, ఎక్కకుండా అజ్ఞాతంగా వుండిపోయిన వారు అనేకులు వున్నారనీ, వారి వివరాలు సేకరించి ప్రచురించవలసిన అవసరం ఎంతైనా వుందని - ఇందుకు తార్కాణంగా, వేదాధ్యయన పరుడైన ఒక బ్రాహ్మణుడి గురించీ, అతని భార్య గురించీ, వారి నిరతాన్నదాన దీక్ష గురించీ వ్రాశాడు. ఈ అన్నదాన విషయంలో కులభేదాలు ఏమీ లేవని వివరించాడు.
ఒకరోజు రాత్రి ఏటి కవతలనుంచి, అన్నం కోసం ఒక హరిజనుడి కేకవిని–మాంచి వరద బిగిమీద వున్న యేటకి అడ్డం పడి ఆ మనిషికి విస్తరి వేసి అన్నం పెట్టిన వైనం తెలియచేశాడు. అన్నదానం చెయ్యడం తప్ప ఏ కీర్తీ ఆశించని ఆ బ్రాహ్మణుడి పేరు అజ్ఞాడ అన్నయ చైనులు గారని, ఆ అనామకుడు వ్రాశాడు.
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-
ఈదినమున నుపన్యాస మేదియు లేదు. సభావ్యాపారముల కేర్పాటయినదిన మిది. ధనము లేకపోవుటచేత నన్ని వ్యాపారములు నశించినట్లై మావ్యాపారముకూడ నశించినది. సారస్వత వ్యాపారము సృష్ట్యారంభము నుండియు దరిద్ర వ్యాపారమే. అందులో నిపుడు