ఈ పుట ఆమోదించబడ్డది

ధలచేఁగాని కనుటయుఁ బెంచుటయు నెన్నఁడు సిద్దింపదు. అందులకు జ్ఞానమక్కఱలేదు. ప్రపంచపుటునికికిఁ బ్రేమయే మూలాధారము.

భగవంతుఁడున్నాఁ డని, లేఁడని, యున్నాఁ డనుమాటయే కాని యాతనికి సృష్టితో సంబంధము లేదని, లేనట్లే యున్నాఁ డని, యెన్నితలతిక్కకొసవెఱ్ఱి సన్నిపాతపు దారులైన మగవాఁడు బుద్ధిలేక తొక్కినాఁడు కాని మగువ యాచింత కెన్నఁడైన లోనైనదా? ఆసంశయ మెన్నఁడైనఁ బొందినదా? ప్రేమస్వరూపుఁ డైన పరమేశ్వరుని యందు నిర్లిద్రవిశ్వాసము, నిశ్చలభక్తి తప్ప ఆమె హృదయమున నింక ముఖ్యమైన దేమైన నున్నదా? ప్రేమామృతపూర్ణ మైన యామె హృదయమందు మఱి యొక్కటి యుండుటకుఁ దా వెక్కడిది?

ఒకమహాపతివ్రత వృత్తాంతమును చెప్పదును. దూరయానశక్తి కలదానను. కావున నే నొక్క రాత్రి హిమవత్పర్వతకాంచన గంగాశిఖరమునఁ గూరుచుండి యుండఁగా నిద్దఱు విద్యాధర స్త్రీలు చెప్పకొన్న మాటల వింటని. అందువలన నేను చెప్పఁబోవు మహాపతివ్ర తను గూర్చిన యంశము లనేకములు వారి సంభాషణవలనఁ దెలిసికొంటెని. అవి తరువాత చెప్పదును. ముం దాయుత్తమకాంత యైహిక కథావృత్తమునఁ గర్ణములు పవిత్రములు చేసికొందము.

కృష్ణగోదావరీమండల మధ్యగత ప్రదేశమున నొక సంపన్నుని కుటుంబమున నామె కొన్ని సంవత్సరముల క్రింద ప్రాచీగర్బమునఁ గాంతి రాశివలెనుదయించెను. ఆమె పుట్టినస్థల మేదియైన మీ కెందులకు? జన్మస్థలమునకు, జన్మకాలమునకుఁ బ్రాముఖ్య మీయఁదగదు. మంచి స్థలమునఁ బుట్టినజీవుఁడు. మంచివాఁ డని యనదగునా? చెడ్డస్టలమునఁ బుట్టి నవాఁడు. చెడ్డవా డనందగునా? జాతకుని స్వరూపస్వభావాదులు జన్మస్థలకాలముల బట్టి లేశము నుండవు. మాలపల్లె యందరుంధతి పుట్టలేదా? బ్రహ్మవంశమున బుట్టినశూర్పణఖ మాట యేమి? దేశ కాలపాత్రాదులు జీవప్రకృతులపైఁ గొంతమార్పు తప్పకుండం గలుగఁ జేయుపని కొందఱు చెప్పదురు. కాని యది సాధారణ ప్రకృతుల వర్తించుమాట కాదు. అసామాన్యప్రకృతులన్నియు దేశకాలపాత్ర బద్దములైనవి కానే కావు. సృష్టిసూత్రమున కవి లొంగునవి కానేకావు. వానిని మినహాయింపుల క్రిందనే మనము చూచి గౌరవింపఁదగును. మనగౌరవము నని యపేక్షించునవి కానే కావు. అట్టి యసాధారణశరీర తేజస్సుతో, నంతకంటె నూఱురెట్లు హెచ్చయిన బుద్దితేజస్సుతో, నంతకంటె నూఱురెట్లు హెచ్చ యిన యోగ్యతాతేజస్సుతో, నంతకంటె నూఱురెట్లు హెచ్చయిన భక్తితేజస్సుతో, నంత కంటె నూఱురెట్లు హెచ్చయిన యాత్మతేజస్సుతో నా తేజస్వినీమణి వేణువులో నాణి ముత్తెము పుట్టినట్టు, పంకమున భగవత్పూజార్హమైనపద్మము పుట్టినట్టు నాగటిచాలున సీతామహాదేవి పుట్టినట్లు, సముద్రమున జగమంతయు శాసించు మహాలక్ష్మి పుట్టిన ట్లాసంపన్నునికుటుంబమున నీప్రభారాశి ప్రభవించెను. ఆకుటుంబమున కెంతో కాంతి వచ్చినది. ఆరాష్ట్రమున కెంతో కాంతి వచ్చినది. భారతదేశమున కంతకుఁ గూడఁ గాంతిఁ దేఁగల కమలాస్వరూపిణియై వెలసెను. ఆమె మహాలక్ష్మి యవతార మని పుణ్యాత్ములైన తల్లిదం డ్రులెఱిఁగి యామెకు మహాలక్ష్మి యని నామముంచిరి. ఈబిడ్డ పుట్టినప్పటినుండియు గన్నవారి కైశ్వర్యము వృద్దికా జొచ్చెను. తెల్లవాలకి లేచి మొదట నీపిల్లమొగము చూడకుండ దైవప్రార్ధనమైనఁ దల్లిదండ్రులు చేసి యెఱుఁగరు. ఈమె మొగము చూచిన నేమిలాభము