లను తిట్టుచున్నామే. ఇన్ని దుర్గుణములు మనకుండ దైవభక్తికలుగునా? ఏమియును లేదు. ఇక మనబ్రతుకు లెందులకు? కడుపునిండించుకొనుటకు, కైపుకలుగునట్టు త్రాగుటకు, కఱవునకుఁ జచ్చి నంతమంది నిర్బాగ్యులను గనుటకు, అంతేనా?
మన పూర్వులే కాదా సృష్టి చిత్ర్యమునకు వింతపడి సృష్టిక్రమమును బరిశీలించి సృష్టినంతయు నిండిన యద్వితీయశక్తికి భక్తివినమ్రులైవేదబుక్కులతో దేవతాగాన మొనర్చి నారు. అందుచే మొదటస్పష్ట్యవ లోకనమునఁ గలిగిన రసమేది? భక్తి ప్రపంచమున మొట్టమొదట వేదములతో బాపేకాదు. వేదములకంటెఁ గొంతముందుగాఁ బుట్టినకళ యేది? గానము. ఈ కళయే లలితకళ లన్నిటిలో నుత్తమమైనది. కవిత్వమే? ప్రపంచమున మొట్టమొదట బుట్టినకళ యని పాశ్చాత్యులేకాదు. పౌర్వాత్యులే కాదు. ప్రపంచజనుల యందఱ యభిప్రాయ ముయియున్నది. అది కేవలము తప్ప. సర్వప్రపంచముగూడ నాపై దిరుగఁబడి నను దోకచుక్క చేత బుచ్చుకొని తోపతోప క్రిందంగొట్టనియెడల -మూతిమీసము కదపా పచ్చిరొయ్యలు గోంగూరలో వేసినప్పటి మజా-
ఉండు. ఉండు నిదానించుకో తోకచుక్కమాట, గోంగూరమాట యిప్పడెందు లకు? శాంతింపు మని యాతనిని శాంతిపఱచితిమి. ఈతని పిచ్చిలో వెనుకటికి నిప్పటి కెంత వ్యత్యాసమున్నదో నా కాశ్చర్యముగ నున్నది. నిముసనిముసమునకుఁ బెడమార్గము సట్టి తిరుగ ద్వరలో దారికి రాలేని వాఁడింతమట్టునకు తాజపడుట గొప్ప సంగతి కాదా? అని లోన ననుకొంటుని.
ఒక్కనిముసమైన పిమ్మట నెంతవఱకు జెప్పితి నని యాతడు నన్నడిగెను. మొదటి రసము భక్తియని, మొదటికళ గానమని చెస్పితివి. తరువాతఁ జెప్పమని వేడితిని.
సరే. సరే. ఆశ్చర్యకరమైన సన్నివేశము మనము తిలకించునప్పడు దానిపై మనకు భక్తి గలిగినప్పడు నిప్ర్పయత్నముగ నబుద్దిపూర్వకముగ 'ఓ' యని ధ్వనికలుగునట్టు మనము నోరు తెఱతుము. వేదములకు ముందు ఓంకార ముద్బుద్దమైనదని మనపూర్వులు జెప్పిన దదియే కాని వారి ఓం, లో నక్షరము లున్నవి. నా, ఓమ్, ఇట్టినాదమే కాని యక్షర సహిత మెంతమాత్రము కాదు. నాదమును విని సంతసింపక యందులో నక్షరములున్నవని దానిన ముక్కల క్రిందఁ గొట్టనేల? ఉదయపర్వతముపై గెంపులసింహాసనముపై గెందామ రల కిరీటముతోఁ దలచూపుచున్న భానుబింబమును గాంచి మహానందభరితమై భక్తిపారవశ్య సహితమై భరతపక్షి గానముచేయుచున్నది గాదా! ఆగానములో నేయక రములున్నవో పరిశీలనయేల? ఏయకరములు లేవు. స్వరంసంఘాతము తప్ప యది మతేదియునుగాదు. షడ్డమస్వరము ముందుబుట్టిన తరువాత దానికి 'స' అనుగుర్తు వచ్చినదా? కాక అది పుట్టినప్పడే 'స' యను గుర్తు దానియందున్నదా? పిల్లవానికి వట్టిధ్వని ముందువచ్చినదా? కాక మాట ముందువచ్చినదా? భక్తిపూర్ణమైన దేవతాగానమం దకరము లక్కరలేదు. నీలాల నిగనిగలీనుచున్న నీరదమును గాంచి మహానందముగఁ గప్పకూసినకూఁతకు, వరుణదేవతా కములగు ఋక్కులకు, నంతఃకరణపరిశుద్దియందు భేద మున్నదని యెవ్వడైనా జెప్పగ లడా? కప్పకూఁతలో నకరములు లేవు. వేద ఋక్కనం దక్షరము లున్నవి. ఋక్కుల కంటె కూఁతయే ముందుఁబుట్టినదని నేననుచున్నాను. పండ్లండ దలంచుకొనినయెడల నీవు కాదనగలవా? అదికాక యక్షరసాహాయ్యము లేని గానము ప్రపంచమున నెంతలేదు?