యుపన్యాసమీయరా" యని తొందరపెట్టితి. "నీకుఁ బిచ్చి యాసుపత్రివదలి వెళ్లుటకు బైవారి యనుమతి వచ్చినదా యని యడుగ' నింకఁ గొన్నాళ్లిక్కడనే యుండుమన్నారు. పైవాఁడెవడు? క్రిందివాఁడెవఁడు? అందఱును దొంగ ముండకొడుకులే. ప్రపంచమునకం తకు మతిలేదని నేను గనిపెట్టి వెల్లడించుట యేమి? నాకు మతిలేదని వీరు నన్నిక్కడ బంధించుట యేమి? శ్రీకృష్ణభగవానుఁ డేమనినాఁడు.
యా నిశాసర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః
నేను వెల్లులోనున్నాను. ప్రపంచమంతయుఁ జీఁకటిలో నున్నది. నావెలుఁగు వారికిఁ జీఁకటి. వారివెలుగు నాకుఁ జీఁకటి. కాని నాకు బాధ, వారికి సుఖము.
గీ. వీరవరుకంఠ మునం దరవారికోత
భీరుగశమున విజయమందారమాల
శేముషీమంతు పెప్టెలోఁ జెదలుపుట్ట
వాలుతలవాని మొులను బత్రాలకట్టు.
విద్యావంతుల కెప్పడు విద్యావిహీనులచేత, జ్ఞానవంతుల కెప్పడులచేత, నర్హుల కెప్ప డనర్డులచేత బాధతప్పదు. ప్రపంచ చరిత్రములో మొదటిపంక్తిలోనున్న యీపాఠమే యిప్పటికి తుదిపంక్తిలో నున్నది. Socrates కేమయినది. విద్యాదూరులనోటికి విందు, పాత్ర విజ్ఞల నోటికి విషపాత్ర, పాపాత్ముల కడుగడుగునకు మెత్తనిమడుగు. పవిత్రాత్మునకు సంధిసంధికి కొరతమేకు. గజం మిథ్య పలాయనం మిథ్య యని పారిపోయినను నేనుగు కాలిక్రిందఁ ద్రొక్కింపక మానుదురా?
అయ్యా అయ్యా నీవు చెప్పచున్నది నాకేమియు బాగుగా లేదు. మనస్సున కేమియుఁ దోపకపోవుటచేత వినోదమునకై నీయొద్దకు వచ్చితిని. ఏదైనసరే యుపన్యాసమొకటి యిమ్మని యాతనిఁ దొందరపెట్టితిని. నా ధోరణికి నీవడ్డు రాకుండనుందువా? అది ముందు చెప్పమని యాతడు నన్నడిగెను. సాధ్యమయినంతవఱ కట్టె యని నే నంటిని.
సరే విను. హరిఃఓమ్ ప్రపంచమం దున్నది యేకత్వమే గాని ద్వివిధత్వము కాదు. ఏదియున్నను నొక్కటియే యున్నదికాని యిన్ని లేవు. రెండునునది మనము తరువాత కల్పించుకొన్నదికాని స్వయముగా లేదు. నాషడ్డకుడు నాయంతవాడు సుమాEconomical depression (ధనలోపము) దేశమునకుఁ గలిగిన తరువాతనే సానివీధిలో Commission agency (పొసగుడు వ్యాపారము) పెట్టిసానిదానియింటిలోనే నేరాత్రియైన సరసుడు లేఁడన్న యప్రతిష్టమాట లేకుండఁజేసినాఁడు. సానివాండ్రను దేల్చినాడు. తాను దేలినాఁడు. వహవ్వా అట్టుభయతారకముగ.
తప్పదారినిఁ బోవుచున్నావని నేనతని మందలింపగ నేను జెప్పను పోపో యని యాతండు కేకవైచెను. ఈమాత్రము కూడ నుండదేమోయని భయపడి సరే నీయిష్టమువచ్చి నట్టు కానిమ్మని బతిమాలితిని. నన్నడ్డకుము, జాగ్రత్తగనే మాటలాడుదును. ఏదో యొక ప్రణాళిక చేసి కొంటిని. ఆదారిని నన్నుఁ బోనిమ్ము సరే యెంతవఱకుఁ జెప్పితిని అని