ఈ పుట ఆమోదించబడ్డది

లేఖనుగూర్చి చెప్పఁదలఁచితినిగాని మఱచిపోయితిని. క్షమింప వలెను.

షాజ:- దీనిలోని సంగతులు నీ కేమైనఁ దెలియునా?

కిన్నెత్:- సర్కార్ నాకెట్టు తెలియును?

షా:-ఈ యుత్తరములోని సంగతులు నేనెరుఁగుదును. నాకనుభవములో నున్నవని నీచే ననిపించిన యడల

కిన్నె- అదేమి సర్కార్! నీయుత్తరములోనున్న గూర్చి యేమియుండును? పైవారెవ్వరైన నన్నుఁగూర్చి మీ పేర నేమైన వ్రాసినారని మీ అభిప్రాయమా?

షా:- ఔను. కిన్నె- నే నెఱిఁగిన సంగుతులన్నియు నిర్భయముగాఁ జెప్పెదను.

షా:- నీవు నన్ను వివాహము చేసికొనక పూర్వము నిన్నెవడైనా వలచెనా?

కిన్నె:- ఆ! ఆతనివల వసాధారణమైనదని నేను దృఢముగాఁ బలికెదను. నేను వానిని స్పష్టముగ నిరాకరించితిని. చచ్చెదనని నాకు వార్త నంపినాడు. నీ యిష్టమని తెలియఁ బఱచితిని.

షా:- అంతవలపు గల పడుచువానిని నిరాకరించి నీవు నన్నల చేసికొంటివి?

కిన్నె- అతనియందు నాకు వలపు లేదుగావునఁ జేసికొనలేదు. నీయం దున్నది గాన నిన్ను జేసికొంటిని.

షా:- ఆతడిప్ప డెక్కడ నున్నాఁడు?

కిన్నె- నేను మిమ్ము జేసికొన్నపిమ్మట వెర్రివెర్రి యాసలన్నియు నడుగంటుచే నెక్కడకుఁ బోయెనో, నే నెట్టు చెప్పఁగలను?

షా:- అసత్య మాడుచున్నావు.

కిన్నె- అయ్యో! వాఁడెక్కడ నున్నాండో నా కెట్లు తెలియును?

షా:- ఎక్కడ నున్నాడో తెలియదా? నన్ను జెప్పమందువా? ఎక్కడ నున్నాఁడా, నీయంతఃపురములో నున్నాఁడు, నీ ప్రక్కలో నున్నాఁడు, నీకౌగిట నున్నాడు.

కిన్నె- అట్టున్న యాతండు నామగఁడైన చక్రవర్తియే కాడా?

షాజ:- నీ మగడు కాడు, నీ ఱంకుమగడు. (ఆమె గుండెపై జఱచుచున్నాడు.)

కిన్నె- పాదూషాసర్కార్ ఆగర్భశ్రీమంతుఁడవే, మహాసుకుమారమూర్తివే, అంత దెబ్బ కొట్టంగ, నీచేయి కందిపోదా? వ్రేళ్లు నొప్పలు పెట్టవా? నీవు కేవలము పొరపాటుపడు చున్నావు. నే నాదోషమెరుగను. ఎరుగను. అల్లాహో అక్బర్! నేను దోషసహిత నగు నెడలఁ నన్నుఁ గొట్టుటకు గఱ్ఱలేదా? కఱ్ఱతోఁ బనియే మున్నది? కత్తితో నఱకరాదా? కాని తప్పు నిదానింపుము. తొందరపడకుము. నా కాకస్మికముగఁ గలిగిన స్థితినిబట్టి యనేకులు నాకు వైరు లుందురు.

షా:- నేను సత్యమునే పరిశీలించుచున్నాను. నీ ఱంకుమగని నీయెదుట కిప్పడు బిలిపింతునా?