ఆకుగాని యాయన యుపవాసము చేసియుండలేదు. తాను పవిత్రాత్ముడగుటచే నట్టు చేయవలసిన యగత్యమును లేదు. కాని యుపవాసాచార మెప్ప డారంభమైనదో తెలియదగ నంత ప్రాచీనమై యున్నది. దేవుని కుమారుని కాలములో మతవిషయములైన దొంగతనము విశేషముగా నుండెను. నిజమైన భగవద్భక్తులు మిక్కిలి యరుదుగా నుండెడివారు. ధనముకొఱకో, యశము కొఱకో, ప్రజాగౌరవము కొఱకో, మతసంబంధమైన ప్రార్థనలు, దానములు, నుపవాసములు మొదలైనవి చేయుచుండెడివారు. ప్రజలను మోసపుచ్చుటకే తన్కర భక్తు లిట్టు చేయుచున్న యుపవాసాది దాంభికాచారములను క్రీస్తుగారు మిగుల గర్జించుచుండెడి వారు. దైవకార్యములను తుచ్చమైన యైహిక లాభముకొఱకై యుపయోగించు కొనుచుండెడి వారు. లెక్క లేకుండ నుండిరి. Phairisees అను పెద్ద తెగవారందఱట్టివారే. ఇంత ననేకములైన యిట్టి తెగలుండెడివి. వారికందఆ కేసుక్రీస్తువారు బోధించినదేమనంగా మీకును భగవంతునికి మాత్రమే సంబంధమున్న మతవిషయక కర్మములన్నియు గూడ నెవ్వరికిఁ దెలియకుండ రహస్యముగఁ జేసికొనుఁడు. అందులో నుపవాసము రహస్యముగనే కాని బహిరంగముగ జరుపకూడదని యాయన యనేకస్థలములందు శాసించినాడు."
ఇట్లు చెప్పి యాక్రైస్తవుం డూరకుండెను. అప్పడు నేను లేచి యిట్టంటని. నాయనలారా! క్రైస్తవమతబోధ మనయందు దయగలిగి యేసుక్రీస్తువార కాలమందలి దేశస్థితి, యుపవాసమును గూర్చి జీసస్సుగారి యభిప్రాయమును వారికిఁ దెలిసినంతమట్టునకు విస్పష్టముగాఁ జెప్పినందులకుఁ గృతజ్ఞలమై యున్నాము. ఈమతగురుడు పరమశాంతుడు. ధారాళహ్పదయము గలవాఁడు. వారిమతమందు బరిపూర్ణ విశ్వాసమున్నవాఁడు. ఎంతసేపు చెప్పినను నిరాహారతపము రహస్యముగాఁ జేయవలయునను జీసస్సుగారి యభి ప్రాయమనియే చెప్పినాడు. కాని మనమహాత్ముని యుపవాస బహిరంగతను గూర్చి యొక్క యెత్తిపొడుపు పలుకైనఁ బలుకలేదు. కాని యట్టిసూచన తప్పదు. అట్టునకున్నను ననినట్టే. దూదూ యని యెంతముద్దుగ ననినను వచ్చునది కుక్క యని గ్రహించుకొనలేమా? ఈమతగురుఁడు చెప్పినమాట లాలోచించి విమర్శింపదగినవి. దీనిని గూర్చి యిప్పడు చెప్పఁబూనిన యెడల నొక గంటసే పగును. ఉపవాసమనగ నేమో, అది యెందులకు చేయవలయునో, పూర్వకాలమం దెవరెవరు చేసిరో, ఎట్టిఫలము లందిరో, ఏసుక్రీస్తు కాలమం దలి నాగరికత యెట్టిదో, సంఘస్థితి యెట్టిదో, ఉపవాసము రహస్యముగనే చేయ వలసినదని యెందుల కాతండు జెప్పవలసియున్నది. ఇప్పడు బోధించెనో యీయంశములన్నియు విపులముగ జెప్పవలసియున్నది. ఇప్పడు కాదు గావున పైవారముల నెప్పడో జెప్పెదను. మతగురుడు మాటలాడు చుండఁగనే యందఱు సభనుండి లేచిపోయినారు. దైవప్రార్ధనం జేయుటకు నేనొక్కడనే యుంటిని.
బిళహరి-ఏక.
జయరామ-జయరామ-జయజానకీరామ
జయనర్వగుణధామ-జయసార్వభౌమా
జయశుభాకరనామ-జయవైరిభీమా. 'జయ'
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః