వస్త్రధారి యైనాడు. పిదప స్వదేశస్వాతంత్ర్యరక్షకుఁ డైనాఁడు. పిమ్మట నింద్రియ నిగ్రహుడైనాఁడు. దానిపై శమదమాదిసంపన్నుడైనాడు. అందుమీఁద లోకాద్బుతచరితుం డైనాఁడు. దానిపై లోకపవిత్రుఁడైనాఁడు. ఆతఁడు స్వరూపమున పొడుకరి కాఁడు. తూని కలో నూటరెండుపానుల కంటె హెచ్చినవాఁడుకాఁడు. అట్టిదుర్బల శరీరుండు శ్రీరంగప్రధాన గోపురముపై నింక నూట రెండంతరువులు వైచినయెడల నదియ దిగియెదిగి పసిడికుండలతో భగవంతుని పాదములను స్పృశించినట్టుండునో యాతఁ డందఱు చూచుచుండఁగనే, చూచుచుండఁగనే యిప్లై యింత యాధ్యాత్మికౌన్నత్య మొందినాఁడు, అత్యాశ్చర్యకరము మూఁడడుగులున్నర వడుగు బలిచక్రవర్తి చూచుచుండంగనే మూఁడడుగు లాక్రమించుకొందునని చెప్పి, సృష్టినంతయు నాక్రమించుకొనిన రమారమి యైదడుగుల పొడుగుగల మనుజుఁడు సర్వ ప్రపంచజనహృదయములను గాఢముగ నాక్ర మించుకొనినాఁడు. ప్రపంచ చరిత్రములో నీవిచిత్రమే క్రొత్తగ జేర్పవలసియున్నది.
జయవిజయులు శాప మొందినప్పడు మూడుజన్మములలో భగవద్ద్వేషముతో తరింతురా? యేడుజన్మములలో భగవద్భకిలో ధరించతురా? యని యడుగఁబడగ మూఁడుజన్మములలో దరింతుమనిరి. మూఁడు జన్మములకంటెఁ దక్కువకాలములో నెవ్వరు తరింపలేరు. ఆంగ్లేయవిగ్రహముగా నారంభించిన యీవ్యక్తియొక్క యిప్పటి యాధ్యాత్మికోత్కర్షత చూడఁగా మహాత్ముఁడీ యొక్క జన్మమునకే తరించునని చెప్పఁదగి యున్నది. అప్డే జరుగునెడల నాత్మపరిణామక్రమమున జయవిజయుల కంటె నీఁత డగ్రస్థాన మాక్రమించుకొనఁగలడు.
అద్వైతమం దేకజీవవాదమని యొకటి యున్నది. ఇప్పడు కనబడుచున్న శరీరములన్నింటిలోను జీవుఁడు లేఁడనియు, నేదో యొక్క శరీరమందు మాత్రమే జీవుఁడునా్నఁడనియు, నాతం డెప్పడు తరించునో యప్పడే మిగిలినవారందఱు తరింతుర నియు నీవాదమునకు ముఖ్యాభిప్రాయము. అట్టివాదము ననుసరించి సజీవుఁడగువాఁ డొక్క మహాత్ముఁడే యేమో! ఎవరు చెప్పఁగలరు? నేను గొంతకాలమునుండి మహాత్మునిఁగూర్చి వినుచున్నాను. ఆయన మాటలకుఁ జర్యలకు నాకుఁదెలిసిన యర్ధమును గ్రహించుచు న్నాను. ఆయనమన స్సెట్లెట్లు పరిణామము నొందుచున్నదో నాకున్న జ్ఞానలేశమునుబట్టి గ్రహించుచున్నాను. నేను మహాదేవునికొక్కటి మహాత్మునకు రెండు నమస్కారము లర్పించి మనవి చేయున దేమనంగా; నాయనతత్త్వము నాకెంతమాత్రము బోధము కాలేదు. ఆయన సన్నిధానవర్తు లెందఱో యున్నారు. వారికేమైన దెలిసినదేమో యనంగ వా రావిషయమున మనకంటె ఘనులు కారని వినుచున్నాను. వారు తెలియనివారని నేను స్పష్టముగా జెప్పఁజాలను, కాని తెలిసినవారు కారని స్పష్టముగాఁ జెప్పఁగలను. వర్ణాశ్రమధర్మము, నస్పృశ్యత మొదలగు మహావిషయములగూర్చి అందుకుఁదగిన మాటలేవో నేర్చుకొని మన ముపన్యాసనాటకము లాడుచున్నామా లేదా? మనము చెప్పచున్న మాటలయర్ధము మన కగుచున్నదా? అట్టివో మహాత్మునితత్త్వ మెట్టెఱుఁగఁగలము?
ఈనడుమ నన్నుఁ జూచుట కొక నటోత్తముడు వచ్చినాఁడు. నడుమ నొకనాటక మాడితిమి. నాటకప్రదర్శనము బాగుగనే యున్నదనినారు. ఆ నాటకములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి భార్యలతో వత్తురు. తుట్టతుద కెవ్వరిభార్యయొద్దకు వారు వెళ్లుట