ఈ పుట ఆమోదించబడ్డది

20. భవభూతి


సంస్కృత పండిత విమర్శకుడొకాయన సాక్షి సంఘసభలో ఒక చిన్న విమర్శనం చదువుతానని కోరడం వల్ల జంఘాలశాస్త్రి ఆ శాస్త్రిగారికి అవకాశం ఇచ్చాడు.

ఆ విమర్శనం భవభూతి మహాకవి గురించి.

అతని కవిత్వం ఎంతో మృదువు. లలితం. ఎంత ప్రయోజకుడైనా, సమకాలికుల చేత ఎక్కువ తిట్టు తిన్నవాడు. శబ్దార్థాలకి రెండింటికీ సమాన గౌరవం ఇచ్చేవాడైనా, ఒక్కొక్క సారి శబ్ద వ్యామోహానికి లొంగిపోతాడు. అక్కడక్కడ మానవ ప్రకృతి పరిశీలనంలో తేలిపోతాడు. మాలతీ మాధ వీయం, మహావీర చరిత్రం, ఉత్తరరామచరిత్ర అనే మూడు నాటకాలు వ్రాశాడు. ఈ కవి ఉత్తమ కవుల్లోని వాడే. ఈ కవి గర్వభూయిష్టుడు. తనను ప్రశంసించని వాళ్లని తిట్టే స్వభావం గలవాడు.

ఈ పండితుడు, భవభూతి స్వభావం బయటపడే శ్లోకాలను ఉదాహరించి వివరించాడు. “సర్వధా వ్యవహర్తవమ్" అనే శ్లోకార్ధాన్ని వివరిస్తూ విమర్శకుల్ని తిట్టడానికే అవకాశం భవభూతి ఉపయోగించుకున్నాడని చెప్పాడు.

కవిత్వం, చిత్రలేఖనం, ఇవి అభిరుచి ప్రధానమైన కళలు. కవులు గ్రంథాల్ని దేశం మీద విడిచి పెట్టినప్పడే, ప్రజలకి వాటిని విమర్శించే అధికారం వుంది. కవులలో చాలా మంది తమ అభిరుచి ప్రకారం వ్రాశారు. ప్రకృతి సూత్రాల్ని బట్టి వ్రాయలేదు. విమర్శించేవారు తన అభిరుచిని బట్టి విమర్శిస్తాడు. ఈ తగవు పరిష్కారానికి సూత్రాలేమిట? ఆ చింత అక్కడ లేదని ఆ సంస్కృత పండితుడి ఉద్దేశం.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:

నాయనలారా! ఒక సంస్కృత పండితుఁడు విమర్శకుఁడు మన సభలో నొక చిన్న విమర్శనము చదివెదనని కోరిన హేతువుచేతనంగీకరించితిని. మీరా విమర్శనమును శ్రద్దతో వినవలయును. అయ్యా శాస్రులుగారూ! మీరిఁకఁ జదువ గోరెదను.