ఈ పుట ఆమోదించబడ్డది

నున్న వ్యవహారమును గూర్చి మనయభిప్రాయ మేమో తెలుపఁగూడదని యొక్కఁ డనెను. వితంతుమివాహములు చేసికొన దలఁచిన మన సోదరీమణుల కిది కొంత నిరుత్సాహముగా నుండును గౌవునఁ బ్రచురింపవలదని మఱియొక్క డనెను. చచ్చిన భర్తలందఱు దయ్య ములై తమ వితంతువుల ప్రక్కలలోనికి రాత్రి భాగమునందు వచ్చుచుండునెడల నింక మివాహము లెందుకు? క్రొత్తవారి విశేషముమాత్ర మేమున్నది? అందుచేత నిరుత్సాహముగా నుండదు. ప్రచురింపుమని యొక్కడనెను. ఇది ప్రధానసాక్షిలోఁ బ్రచురింపక సభావ్యాపార సాక్షిలో బడవేయువలయు నని యింకొక్క డనెను. అందఱుగూడ నీ కడపటి యభిప్రా యమును మన్నించిరి.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః