ఆ. చేత కత్తి మహిమ జింతించి చెప్పంగ
బమ్మతరమె వాని బాబుతరమె?
యని మంగలి సుబ్బరామ కవి చెప్పిన నావేశపూర్ణములగు వాక్యములు వేదవాక్యముల కంటే వేరుకావు.
క్షురకవృత్తిలోని రహస్యములఁ గొన్ని మనవి చేసెదను. ఒకగడ్డమును క్షౌరముచే యుట కొక్క డొక గంట తీసికొనును. ఒక్కడైదు నిముసములలో మూండు గడ్డములుచే యును. ఆహ్వాన సంఘాధ్యక్షుని మేనమామగారు గానుగయె ద్దోకచుట్టు తిరిగివచ్చులోపల నొకగడ్డమును బూర్తిచేసెడువాఁడు. వేగముగాఁ జేయువాఁడు నిమ్మళముగఁ జేయలేఁడు. నిమ్మళముగఁ జేయువాఁడు వేగముగఁ జేయలేఁడు. సారస్వతమందు మాత్రము? గొలుసుక ట్టుగ వ్రాయువాఁడు విడి యక్షరములు వ్రాయలేఁడు. విడియక్షరములు వ్రాయువాఁడు గొలుసుకట్టుగ వ్రాయలేఁడు. మెత్తని పదనుకత్తితోఁ జేయువాడు గరసుపదను కత్తితో జేయలేఁడు. గరసు పదనుకత్తితో జేయువాడు మెత్తనిపదను కత్తితోఁ జేయలేఁడు. సారస్వత మందు మాత్రము? సన్నకలముతో వ్రాయువాఁడు ముదుక కలముతో వ్రాయలేఁడు. ముదుక కలముతో వ్రాయువాఁడు సన్నకలముతో వ్రాయలేఁడు. ఎడమచేతి వాటము కలవాఁడు క్రౌరము కుడిదౌడ నారంభింపలేడు. కుడిచేతి వాటముగలవాఁ డెడమదౌడను బని యారంభింపలేఁడు. సారస్వతమందు మాత్రము? బాగుగా మాటలాడఁగలవాఁడు బాగుగా వ్రాయలేఁడు. బాగుగా వ్రాయగలవాఁడు బాగుగా మాటలాడలేఁడు. చర్మము చిట్టకుండ కూటితీయగలవాఁడు మిగులజాణ. అట్లుచేసియు 'కూటి కాయలు మొలవ నీయకుండ జేసినంవాడు మఱింతజాణ. సారస్వతమునందు మాత్రము శబ్దాలంకారముల కొఱకు దేవులాఁడువాఁడు రసపుష్టికలుగఁ జేయలేఁడు. రసపుష్టికిఁ జూచువాఁడు పద్యము కుంటగంజెప్పును. ఈలోపములదీర్చు వానికి గ్రంథచౌర్యము తప్పదు. ఇట్టిలోపములు సారస్వతమం దెట్లో క్రౌరమునం దట్టే. ఈలోపములను సాధ్యమైనంత వఱకు రానీయకుండ సవ్యసాచులై సంపూర్ణులై మీరు ప్రకాశింపవలయునని నాప్రార్ధన. అన్ని లోపములగూడ సాధ్యమైనంత వఱకుఁ జేఁతకత్తి తీర్పఁగల దనివాదృఢ విశ్వాసము. ఈచేతకత్తితోనే జగపతులు, గజపతులు కాలక్షేపము చేయించు కొనిపైలోకమునకు వెడలిపోయినారు. నిద్రవచ్చు నట్టు శౌరము చేయఁగలకత్తి చేత కత్తి, నూరాలులు, వేయాఱులు, నగ్రహారములు సంపాదించినదీచేతకత్తియే. ఒకసారి మాకుటుంబములో జరిగిన చిత్రమును జెప్పెదను. మా పూర్వులలో నొకండు పెద్దాపుర పుజగపతులలో నొకరికి క్రౌరము చేయుచుండెను. చేయుచుండగా కత్తికొయ్యపిడి వదలయినది. పిడి బిగించుటకై యాతండు టక్కుటక్కున ప్రభునినెత్తిపైఁ గొప్టెను. అంతట జొటజొట కన్నీళ్లు లాప్రభువునకు వచ్చినవి. కాని గోనేడవారు, పోలవరపువారు కుదుర్పలేక పోవుటచేత చిరకాలమునుండి బాధించుచున్న పోలవరపువారు కుదుర్పలేక పోవుటచేత చిరకాలమునుండి బాధించుచున్న పార్శ్వపునొప్పి మందల పిడిపోటుచే నెగిరిపోయినది. అనతి కందుకై యగ్రహార మొసంగబడినది. అప్పటి నుండియుఁ బార్శ్వపునొప్పియున్నవారు శిరోవాతమున్నవారు నాతనియొద్ద నట్టు నెత్తిపై బిడి బిగింపించుకొను చుండెడివారు. చేతకత్తితో గీఁకిన తలకుఁ గలుగు చలువు యావునేతితో గలుగదు. ఆముదముతోఁ గలుగదు. వేదాంత సంబంధమైన విశేషమొక్కటి కలదు.