ఈ పుట ఆమోదించబడ్డది

రాతిమీద విలాసముగ నూఱుచున్న యొక క్షురకుడు చిత్రంపబడినాఁడు. ఇంక నొక్కజెండాపై తోలుపొది నొడిలోఁ బెట్టుకొన్న మహాలక్ష్మీదేవి చిత్రింప బడియున్నది. ఇంకొక్కజెండాపై శారాదాదేవి, చేతిలో నొక్క తక్కెడతో నవ్వుచు నిలువంబడియున్నది. ఆత్రాసులో కొక చిప్పయందు గంటము, ఒంటె వెంట్రుక కుచ్చుతాపి ఉలియు, రెండవ చిప్పయందు గత్తెరయు నున్నవి. కత్తెరవైపున బరువెక్కువగా నున్నట్టు కనఁబడుచున్నది. బహిరంగత కొఱకు నన్నొక సోడాబుడ్ల బండి మీఁదఁ గూర్చుండబెట్టి యెనమండ్రు క్షురక విద్యాపారంగతు లనేక శతమంగళ వాద్యములు ఘోషించుచుండ సభకు లాగుకొని పోయిరి. అప్పటి కింక నుదయ మేడుగంటలకంటె నెక్కువ యైయుండపోవుటచేత సభయైనతరువాత నక్కఱకు వచ్చు ననికూడ దెచ్చుకొన్నపొదులను కొందఱు కరతాళధ్వనుల సౌకర్యముకొఱకు నాయొడిలోఁ బెట్టిరి. సోడా బండిదడదడలో నవి యూడిక్రింద బడునేమో యని కొన్నిటిని జేత గట్టిగఁ బట్టుకొనియుఁ గొన్నిటిఁ దొడల క్రిందఁ బెట్టి నొక్కియు వాయువేగముతోఁ బట్టుకొనియుం గొన్నిటిఁ దొడల క్రిందఁ బెట్టి నొక్కియు వాయువేగముతోఁ బోవుచు న్నాను. ఒక్కమంగలియొద్ద నొక్కపొదికంటె నెక్కువగా నుండవలసిన యగత్యము లేనప్పటికి మంగలి సభాధ్యకుఁడనైన నాయొద్ద నేడుపాదు లేకకాలమందుండు నదృష్టము సిద్దించి నది. ఎట్టో సభలోనికిఁ బోయితిని. సభ కన్నుల వైకుంఠముగ నున్నది. కదళీవృక్షచ్చటలు, వట్టివేళ్లతడకలు, చలువ చప్పరములు, కొబ్బెరాకుల వీవనలు మండువేసవిని మఱవఁజేయు చున్నవి. సభలో వేయిమంది క్షురకు లున్నారని తెలియవచ్చినది. ఇతర శాఖలవా రింక నెందలతో యున్నారు.

అంత నొక్కమంగలి చెంగు చెంగున నుపన్యాసరంగ మలంకరించి దైవప్రార్డన మిట్టొనర్చెను.

ఉ. ఎప్పడు భూమిఁ బుట్టితిజా యెప్పడు జానకిచెట్టఁ బట్టితో
ఎప్పడు కానమెట్టితిఱా యెప్పడు రావణు గిట్టఁగొట్టితో
అప్పటి గాథలెల్ల నిల నార్యుల చిత్తములందు గట్టిగా
ముప్పిరి పేట నల్లుకొని పోయె రఘాద్వహ! మమ్ముఁ బ్రోవుమా.

సోదరులారా! ఈసభకు మనమెవ్వరినైన నధ్యకుని నియమించు కొనవలసి యున్నది. సాక్షిసంఘమునకు శౌరశాలకు భేద మేమియులేదు. మనమొక చిన్నకొట్టులో మనదుకాణ మొకరిద్దఱసాహాయ్యముచేఁ బెట్టుకొనినట్టే వారుకూడ నొకకొట్టులో నొకరిద్దఱకితోడుతంజిన్న సంఘము స్థాపించుకొనినారు. మనలఁ జూచుటకు నిత్య మెందఱో వత్తురు. వారిని జూచుట కనుదిన మెందఱో వత్తురు. మనయొద్దకు వచ్చినవారిమనస్సున కాహ్లాదముగ మనము వర్తిల్లునట్టే వారియొద్దకు వచ్చినవారిమనస్సు కానందమగునట్టు వారు ప్రవర్తింతురు. వారమున కొక్కదినమున ననగా నాదివారమున మనకు లెక్కలేనంత జనము వచ్చినట్టేడే, శుక్రవారమునాడు వారిసంఘమునకు నట్లే వత్తురు. ప్రధాన శౌరకుడు మనలో నొక్కఁడే యున్నట్లు వారిలోఁ బ్రధానవక్త యొక్కడే. మనసంఘమును స్థాపించిన పూర్వా చార్యుల పేరిట సంఘమెట్టు నడచుచున్నదో వారి సంఘముకూడ సాక్షిపేర నట్లే జరుగుచున్నది. సాక్షి యుపన్యసించుటగాని, వ్రాయుటకాని యేమియు లేదు. మన సంఘస్థాపకు డట్టలంకారముగా గోడపై నుండుటయేకాని యొక్క కత్తి నూఱినాడా? ఒక్కగడ్డము