సత్యము, ధర్మము, దయయుం, బాతివ్రత్యము ననునవి Barbaric Virtues అనియును, నవి యనాగరకులయొద్ద నుండఁదగినవి కాని దమయొద్ద నుండఁదగినవి కావనియు గొందఱ యభిప్రాయము. మనవారు సత్యము ధర్మము దయము Virtues నుండి తీసివైచినారు. ఇంక బాతివ్రత్యమునుగూడ నట్టు తీసివేయుదురేమో తెలియదు. చంచలబుద్దులగు మగవారట్టు తీసివైచినను బూర్వమహాపతివ్రతల చలువ చేత నట్టి దుర్దశ రానేరదు.
వంక దాటులలో మగవారు ఘనులు
వంశమర్యాద యెన్నఁడు వదల దబల
యింట పరిశుద్ది యెల్లప్ప డింతి వలన
నిలబడును గాని మగవాని వలన
గాదు ఆడుదాని యాచార మాహాత్మ్యమునను
బురుష కానికూళ్లును దొంగపోకడలును
బైగనే కాని యింటిలోపలికిరావు
కాన నిప్పటికిని జాతి ఘనతదక్కె
కట్టు విడఁదైంపి చెలరేఁగ కాంత నడవ
దేశదుస్థితి సంజ్ఞగాఁ దెలియవలయు
నిట్టిదుర్దశ మనకు లే దింతవఆకు
భావిగతి యేదొ యెవ్వరు పలుకఁ గలరు?
ఎంత చెడినను మన స్త్రీలె యిలను గలుగు
నబలలం దుత్తమోత్తమ లనుట తగును
దేశసుభగత మగవాని తెలివింబట్టి
నిలువ దబలయోగ్యతం బట్టి నిలుచుఁగాదె?
తండ్రియిచ్చిన యవకతవక యాజ్ఞల నన్నియు నంత బుద్దిహీనముగా వినుటయేనా? తన కామాత్రపు judgment అక్కఆలేదా? అందుచే రాముఁడు వట్టి Blockhead అనుచు న్నారు. హరిశ్చంద్రు నంతటవానిని భార్యావిక్రయ సందర్భమున Inhuman brute అనుచున్నారు. అతని సత్యరక్షణమును గూడ నెంతమాత్ర మిప్పటివారు మెచ్చకుండ నున్నారు. భార్య నొకనికి దాన మిచ్చిన రఘు మహా రాజును At once an Emperor and go-between అనుచు డాఫరుజాతిలోని కీడ్చివేసినారు. సత్యవైరాగ్యస్వార్ధరాహిత్యద్యనేక గుణములు మోక సాధనము లైనవి పోయినను మత మింక నిల్చియున్నదా? ఇట్టి మనస్థితిలో నొక్కమాట నడిగెదను. యథార్థముగ నస్పృశ్యులు మనమా పంచములా? వారికి మనవిద్య లేదు. అందుచేత మనకున్న యింద్రజాలమహేంద్రజాలములు వా రెరుంగరు. వారికి మనకున్న నాగరకతలేదు. అందుచేత మనకున్న కానికూళ్లు తప్పతిరుగుడులు వారికి లేవు. అందుచేత మనమే మస్పృశ్యులము. మనయుద్దరణము మాట యేమి? ముందు సృష్టిలోనో యీపై సృష్టిలోనో జరుగునో లేదో యను నంశమునుగూర్చి యిప్పడు చింత యేల?
బ్రాహ్మణ స్త్రీకి శూద్రునివలన గలిగినబిడ్డలు పంచములని చెప్పినారు. ఇది సత్యమో యసత్యమో యెవరు చెప్పగలరు? ఎటులైనను తలక్రిందు పెండ్లిండ్గు తగవని, యందువలనఁ గలిగినసంతానములు బహిష్కారయోగ్యము లని యిందువలన నిర్ణయించుట కవకాశము