పుణ్యాత్ముఁ డైనరాజా రామ మోహనరాయలు దీని నివారించుటకుఁ బ్రయత్నింపంగా నాకాశ మంత నోరు పెట్టుకొని మనవారు వాదించియుండలేదా? మతము పోవు నని మొఱపెట్ట లేదా? మహజర్లు చేయలేదా, మామగలతో మేము చితి నెక్కినఁగాని మాకు మోక్షము లేదు లేదని స్త్రీలచేత సంఘవిజ్ఞాపనములు చేయింపలేదా? మత మిప్ప డేమాత్రము పోయినది?
వితంతువివాహము పనికిరాదని మనము ఘోషింపలేదా? అందును గూర్చి యెన్ని తగవులైనవి? ఎన్నివ్యాజ్యెములు పడినవి? ఎన్ని చార్జీలు జరిగినవి? మతము పోవునని యెంత యల్లరి ప్రబలినది? సంస్కర్తల కెన్నితిట్టయినవి? చిట్టచివర కవి బాహాటముగ జరుగుచుండుట లేదా? అసలు పెండ్లికూఁతు మొగములో కంటె విధవపెండ్లికూఁతు మొగములో నెక్కువ పెండ్లికళను మనవారు చూచుచుండుట లేదా? పెద్ద లంద అట్టి పెండ్లిండ్లకు సంఘసంఘముల క్రింద నుత్సాహమున చేరుటలేదా? ప్రస్తుతపు మగడు పరమపదించినపి మ్మట మనమతని వితంతువును జేసికొంద మని కొంద రుఱ్ఱూటలూరుచుఁ గనుపెట్టికొని యుండుటలేదా? ఇప్పడు తమమత మేమైనట్లు? ఏమాత్రము పోయినదయ్య!
రజస్వలావివాహమునుగూర్చి యెంత గందరగోళమైనది? ఆచట్టమువచ్చినతర్వాత నోరు మూసికొని పడియుండిరా? లేదా? సీమవెళ్లినవారి నేమాత్రము బహిష్కరించు చున్నాము? అట్టివారే వెళ్లనివారిని బహిష్కరించుటకు సిద్దమై యున్నారుకాదా? పలపైతృకము మానిన తరువాత తమ మత మేమైనఁ బోయినదా? పూర్వపు దేవరన్యాయము మాటయేమి?
అదిగాక స్త్రీవిద్యయే కూడదని యెంత యజ్ఞలమై వాదించితిమి. ఇట్టి మన యప్రతిష్ట యస్వాభావికత యనౌచిత్యము హిమాలయపర్వత ముండదగినంతకాల ముండదగినది . కాదా? మన యానాంటి యవకతవక మాటలు భారతకాంత కొడలిమీది వ్రాతలుగా నిల్చి యుండును గాని పోవునా? వేదాధ్యయనము లేదు. బ్రహ్మచర్యము లేదు. పోని గూడక ట్టయిన నున్నదా? యజ్ఞోపవీత మున్నదో లేదో తడిమి చూచుకొనుడు. త్రిమతస్థులలోని వైదికులకుగూడ కొందఱు సన్న్యాసులకు గూడ నుల్లిపాయల పెసరట్టు లేకుండ కాఫీ గడచుచ్నుదా? ఇది గాక ఆంగ్లేయ భోజనమఠములలో మనము దినుచున్న మాంసజాతులకు హద్దున్నదా? ఏలయుండును? పప్పునియమ మెప్పడు దాఁటితిమో పందిమాంస మైన నేమి, నందిమాంస మైన నేమి, సవర్ణు లుపయోగించుచున్న మాంసమును బ్రాందిని నేపంచము లుపయోగింపఁగలరు? మతమో మతమో యని యిఁక నేమొగము పెట్టుకొని దేవులాడుచున్నారు? తమ మిదివఱకే పోయినదా? ఇకం బోదు. ఇదివఱకుబోలేదా ఇంకబోదు.
పోయిన వన్నియుఁ గూడ బాహ్యాచారములు, మతమునకు బహిర్లాంఛనములు. మతము విభూతిపండుతోఁగాని చిట్టిగారెతోఁగాని గోపీచందనముతోఁగాని నిల్చునది కాదు. రాజునకుఁ గిరీట మెట్టిదో భటునకు డవాలి యెట్టిదో మతమున కాచార మంత కంటె నెక్కువది కాదు. నవనాగరకనారీశిరోమణీ చీకటులఁ జిమ్ము జట్టు కత్తిరించుకొని మోంకాళ్ల వఱకు మాత్రము లాగుతొడిగికొని సైకిలెక్కి వీథులవెంట స్వారిచేసినంత మాత్రమున నామె స్త్రీత్వమేమైన దగ్గినదా? మతమునకుఁ బ్రధానము లైనవి కొన్నియున్నవి. అవి పోయినయె డల మతము పోవును. అవి యేవన, దయ సత్యము శౌచము స్వార్దశూన్యత వైరాగ్యము భక్తి జ్ఞానము మొదలగునవి. వీనిలోఁ గొన్నియైన మనకుండునెడల మత మెన్నఁటికిని