ఏమి ప్రయత్నమొనర్చి చచ్చుచున్నది. తన ప్రయత్న మక్కఱలేదు. ఇతరుల ప్రయత్నలేశ మైన నున్నదా. దానిలోని పురుగులు నీళ్లలోనిపురుగులు ఏమి ప్రయత్నమొనర్చి జీవించుచు న్నవి? ఏప్రయత్నలోపమునఁ జచ్చు చున్నవి. ఇటులే పైజంతువులకుమాత్ర మేల కాదు? ఏజంతువుకూడ స్వప్రయత్నమునఁ బుట్టదు. ఏజంతువుకూడ స్వప్రయత్నమున నెదుగదు. స్వప్రయత్నమున నశింపదు. ప్రయత్నమే లేదు. ప్రయత్నించుట కుద్దేశమైన లేదు. ప్రయత్నించుటకు స్వతంత్రతయే లేదు.
చూచితివా? ప్రపంచమున నెచ్చటనయిన నత్యద్బుత మయిన శక్తి యవాచ్య మయినశక్తి, యవర్ద్య మయినశక్తి లేని యంగుళము అరయంగుళము అంత వఱకుకూడ నెందులకు? ఒకచుక్కయంత స్థలమయిన లేదు. ప్రమాదవశమున నోటనుండి జారినతుంపర రేపు అట్టాంటిక్కు మహాసముద్రమున నుండి బయలుదేరిన యావిరితోఁ జేరి యమెరికాలోని వర్షముల కాధారము లయిన యబ్దమండలముల కాదికారణమగుచున్నది. ఆశక్తియే చంపించుచున్నది. పుట్టించుచున్నది. పెరిఁగించు చున్నది. త్రిప్పించుచున్నది, తనలోఁ గలుపు కొనుచున్నది. తిరుఁగ దనలోనుండి మరియొకరూపమున మరియొక పరిస్థితిని తీయించుచున్నది. సాగించుచున్నది. మరల గుణించుచున్నది. టప్పమనిపించు చున్నది. ఇంతకంటె మనుష్యష్ఠితి యొక్కువకాదు కాదు కాదు. మనుష్యునికి బుద్దియున్నది కాదా? అందుచేతఁ బ్రయత్నము చేయుచున్నాఁ డని చెప్పదువా? బుద్ది యొక్కడ నుండి మనుజునకు వచ్చినది? పురుగునుండి వచ్చినదా? చెట్టునుండి వచ్చినదా? చేపనుండి వచ్చినదా? మృగమునుండి వచ్చినదా? క్రిందివారి కెవ్వరికిలేని యీతత్త్వము మనుజుని కెటనుండి వచ్చినది? మనుజుఁడితర జంతువులవలెనే బుద్దిహీనుఁడు. మనుజుఁ డక్కడకు వెళ్లినా ననుచున్నాఁడు. ఇక్కడకు వచ్చినా ననుచున్నాఁడు. ఇన్ని గంటలకు భుజించెద ననుచున్నాఁడు. ఇన్నిగంటలకు నిద్రించెద ననుచున్నాఁడు. అక్కడ ననఁగా నేమో, యిక్కడ ననంగా నేమో, గంట అనంగా నేమో, కాలము అనంగా నేమో చెప్పఁగలఁడా? స్థల మనంగా నేమి, కాలమనంగా నేమి, స్థలము కాలము బాహ్యస్తములే యని కొందఱనుచు న్నారు. స్థలమనఁగా నన్నిస్థలము లని కొందరు ఆనుచున్నారు. ఇన్నిస్థలము లెక్కడివి? ఉన్నదొక్కటే స్థలము. అది మనకు వెలుపల లేదనుచున్నారు. ఎక్కడ నున్నదని యడుగ నది మనస్సులోని యభిప్రాయ మనుచున్నారు. ఇక్కడకు తేలినది. కందస్వామియాలయ మునకుఁ గపాలేశ్వరుని యాలయమునకును దూరము మదరాసులోనిది కాదు. నీతలకాయ లోని దనుచున్నారు. ఇటులే కాల మనంగా నన్నికాలము లనుచున్నారు. భూతభవిష్యద్వర్త మానముల భేదము చచ్చినది సరేకదా! పగటిరాత్రి భేదముకూడ భగ్నమైనది. తుట్టతుదకుఁ గాలము కూడ మనస్సులోని యూహయనుచున్నారు. అటు లయిన "ఎక్కడ”కు “ఎప్పడు'కు భేద మే మున్న దని యడుగఁగా లేకపోయిన లేకపోవచ్చు నని యనుచు న్నారు. ఈస్వల్పాంశమునుగూర్చియే మనుజుని యజ్ఞాన మింత గాటమైనప్పడు మనస్సు నుగూర్చి యాత్మనుగూర్చి యడుగ నేల?
మనుజుఁడు మహామందుఁడు! బుద్దియున్న దను బ్రాంతిచేత మలకింత బుద్ది హీనుఁడు. సృష్టినంతయు నాక్రమించిన యద్వితీయశక్తికెండిపోయిన యాకెంతయ ధీనమై చచ్చినట్లు దాని విసరునఁ బోవుచున్నదో మనుజుఁడుకూడ నాయపార శక్తికిఁజచ్చినటులే