ఈ పుట ఆమోదించబడ్డది
96
అయ్యొ సొగసుగులాబి పోయెదె?
అయ్యొ చనెదె వసంతమా? నా
తియ్యనౌ యౌవనమ వెడలెదె
తావిఁ గోల్పోయి;
ఒయ్యనను శాఖాగ్రమందున
వియ్యమందించితివి చెవులకు
తియ్యపాటల, భరతపక్షీ
నీవు విడిచెదవే!
97
జీవనంబను నీయెడారిని
పోవు టెన్నాళ్ళోకదా మఱి
పోవఁగా నిటఁ దిరిగి వచ్చుట
యున్నదో లేదో,
చావునిత్యమొ బ్రతుకునిత్యమొ
యేవిధమునను దెలియరాద
య్యో! విచారమె నిత్యమని ని
శ్చయము చేసితిని.
49