ఈ పుట ఆమోదించబడ్డది

88

“మనలఁ జేయుచు నున్నయప్పుడు
ననువు తప్పుచు వంకఱైనను
కినుక తోడుత నావమునఁ బడ

ద్రొబ్బివేయునని

యనుచునుందు రదెల్ల కల్లయె
కనికరము గలవాఁడు నాతడు
తనవి తానే పాడు చేయునె?"

అనియె మఱియొకటి.


89



“వారు నా జీవంపుమొలకను
వేరితో బెల్లగిలఁ దీయుచు
దూరముగ కొమ్మలను జీల్చుచుఁ

బాఱ వేయఁగనీ

చేరి నే నైనట్టి మంటిని
కోరికను మధురసము పోసిన
వేరు తన్నుచుఁ దిరిగి లేచెద”

ననియె మఱియొకటి.

45

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/51&oldid=322266" నుండి వెలికితీశారు