ఈ పుట ఆమోదించబడ్డది
64
వెడలిరే కోటానకోటులు
పుడమి వీడుచు నిరులు క్రమ్మెడు
నడవి మార్గముఁబట్టి యొకఁడును
దిరిగి రాఁడేమీ?
అడిగి దారిని తెలియఁగా సరి
పడదు; మనమును దానిఁ గనుఁగొన
నడచి పోవఁగవలయు వేఱొక
దిక్కులేదు కదా!
64
ఎవ్వరో విద్వాంసులంట
ఎవ్వరో యోగీశ్వరులునఁట
ఎవ్వరో తెలిసికొని వచ్చిరఁ
టంట యీకతలు
ఎవ్వరయ్యా నమ్ముతా రవి
పవ్వళింపఁగఁ గలను గాంచిన
వివ్విధంబునఁ దెలిపి వారుసు
బవ్వళించారు.
33