ఈ పుట ఆమోదించబడ్డది

60

అల ముహమ్మదుగజిని యల్లా
నిలను నమ్మనివారి గత్తికి
బలియొనర్చినలీల ద్రాక్షయు

నాత్మఁ జుట్టికొని

నలియఁజేయు విచారములను
బలసియుండు భయంబులను నలి
నలియొనర్చియు సంతరింపఁగఁ

జేయఁజాలుఁ జుమీ.


61


ఎవఁడురా దుర్వ్యసనమంచును
చవట మాటల నాడుచున్నాఁ
డవని నెల్లను దాసృజించియుఁ

బెంచి పోషించి

మివుల సద్వస్తువులఁ జేర్పక
తెవులు తెచ్చెడివానిఁ గూర్చునె
చవులు పుట్టెడు ద్రాక్షరసమును

విషసమం బగునే?


"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/37&oldid=322218" నుండి వెలికితీశారు