ఈ పుట ఆమోదించబడ్డది
30
ఇందులోనికి వత్తుమఁట, యది
యెందుకో యొక్కింత తెెలియదు
ఎందునుండియు యంతకంటెను
అసలె తెలియదుగా,
ఎందులకో యిటనుండి, యింతయు
సందియముగద; నీటిఁబోలెను
ఎందొ పరుగిడి గాలిపలె నెటొ
యెగిరి పోయెదము.
31
భూమిమధ్యను నేమియున్నదొ
యేమిగలదొ శనైశ్వర గ్రహ
ధామమం; దీ రెంటి మధ్యను
గల్గువింతలను.
నేమమున నేఁ దెలిసికొంటిని
ఆ ముడుల నే నెల్ల విప్పితి
నేమిచిత్రమొ కర్మబంధ మె
విడకయున్న యది.
16